ఎవరీ నందు, నవీన్‌? | Twist in Sirisha's Case: two audio tapes leaked | Sakshi
Sakshi News home page

ఎవరీ నందు, నవీన్‌?

Published Thu, Jun 22 2017 2:47 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM

ఎవరీ నందు, నవీన్‌? - Sakshi

ఎవరీ నందు, నవీన్‌?

శిరీష కేసులో తెరపైకి మరో రెండు పేర్లు
►  వారితో జరిపిన సంభాషణలు వెలుగులోకి.. శిరీష స్నేహితులుగా అనుమానం
► ముందు తేజస్విని విషయం వారికే చెప్పిన శిరీష
► అంతా అయిపోయిందంటూ ఫోన్లో చెప్పిన ఇరువురూ
► అయినా ఫలితం లేకపోవడంతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వివాదం
► రాజీవ్, శ్రవణ్‌ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన పోలీసులు
► తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌ ఆడియోల్లో ఉన్న అంశాలివీ..

హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యూటీషియన్‌ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. నందు, నవీన్‌ అనే ఇద్దరితో శిరీష మాట్లాడినట్లు భావిస్తున్న రెండు ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌ ఆడియోలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాల్‌ రికార్డింగ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. వెలుగులోకి వచ్చిన ఆడియోలను పరిశీలిస్తే.. తనకు, రాజీవ్‌కు తేజస్వినితో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా శిరీష తొలుత నందును కోరినట్లు తెలుస్తోంది.

అతడితో పాటు అతడి స్నేహితుడైన నవీన్‌ సైతం తేజస్వినితో మాట్లాడామని, విషయం సెటిల్‌ అయి పోయిందని, ఇక ఆమె మీ జోలికి రాదంటూ శిరీషతో చెప్తున్న మాటలు ఆడియోల్లో ఉన్నాయి. వీరిలా చెప్పినా తేజస్వినితో ఇబ్బందులు కొనసాగిన నేపథ్యంలోనే శిరీష మరో స్నేహితుడైన శ్రవణ్‌ సహాయం కోరి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీష–రాజీవ్‌.. శ్రవణ్‌ ద్వారానే కుకునూర్‌పల్లి వెళ్లడం, అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని కలవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే.

రాజీవ్‌ ఇబ్బంది పడకూడదని..
రాజీవ్‌ను శిరీష ఎంతో సన్నిహితంగా భావించినట్లు ఈ ఆడియోల్లో స్పష్టమవుతోంది. ఫోన్‌ సంభాషణలో నందు.. రాజీవ్‌ను ఉద్దేశించి ‘వాడు’అని సంబోధించగా.. దీన్ని శిరీష తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి సందర్భంలోనూ రాజీవ్‌ ఇబ్బంది పడకూడదని, అతడికి ఎలాంటి టెన్షన్స్‌ ఉండకూడదని శిరీష ప్రయత్నించినట్లు ఆడియో రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. తేజస్విని నుంచి ఎదురైన ఇబ్బందుల వల్ల ఆమెపై పెంచుకున్న ద్వేషంతోనే నందు, నవీన్‌ ఆమెను ఫోన్‌లో ఏమని దూషించారో తెలుసుకోవాలని శిరీష భావించింది. వారు తేజస్వినితో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్స్‌ పంపమని వారిని పదేపదే కోరడం ఆడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది.

వారిద్దరూ ఎవరు..
నందు, నవీన్‌ ఎవరు? శిరీష కోరిన మీదట వారు తేజస్వినితో మాట్లాడారా? లేక మాట్లాడామంటూ శిరీషతో చెప్పారా? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిరీష కాల్‌ డిటైల్స్‌ ఆధారంగా వీరిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెసై్టన రాజీవ్, శ్రవణ్‌లను తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీరు కస్టడీలోకి వచ్చిన తర్వాత నందు, నవీన్‌ వివరాలు రాబట్టాలని నిర్ణయించారు.


ఎక్కడివా ఆడియోలు?
మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న శిరీష –నందు –నవీన్‌ సంభాషణల ఆడి యోలు ఎక్కడివనేది ఇప్పు డు కీలకంగా మారింది. వీటిని ఎవరో ఉద్దేశపూర్వ కంగా లీక్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంభాషణను బట్టి అవి శిరీష, ఆమె స్నేహితుడు నందు ఫోన్ల మధ్య జరిగినట్లు తెలు స్తోంది. వారి ఫోన్లలోనే వీటి రికార్డింగ్‌కు ఆస్కారం ఉంది. శిరీష చనిపోయిన రోజే ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేసిన శుక్రవారం వారి ఫోన్లతో పాటు శిరీష ఫోన్‌ను సీజ్‌ చేశామని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని పేర్కొంటున్నారు.

అయితే మంగళవారం రాత్రి నుంచి ఈ ఆడియోలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో వచ్చిన తర్వాతే ఆడియోల విషయం తమకు తెలిసిందని, కొత్తగా తెరపైకి వచ్చిన నందు, నవీన్‌ల విషయం రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీలోకి తీసుకున్నాక ఆరా తీస్తామని పోలీసులు చెపుతున్నారు. శిరీష ప్రవర్తనపై మచ్చ తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వీటిని కొందరు లీక్‌ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఫోన్‌ నుంచి లీక్‌ అయ్యాయా? లేక రాజీవ్‌ స్నేహితులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. శిరీష ఫోన్‌లో అనేక ఆడియోలు ఉండగా.. వాటిలో ‘ఎంపిక’చేసిన వాటినే లీక్‌ చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 

కస్టడీ పిటిషన్‌లో పలు అంశాలు..
శ్రవణ్, రాజీవ్‌ల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని కోణాలు వెలికి తీయాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్రపై ఆరా తీయాల్సి ఉందని, ఆమెకు, శిరీషకు ఉన్న గొడవలకు కారణాన్ని వెలికితీయాల్సి ఉందని, రాజీవ్‌–తేజస్విని మధ్య సంబంధాలను ఆరా తీయాల్సి ఉందన్నారు. శిరీష–శ్రవణ్‌–రాజీవ్‌ కారులో కుకునూర్‌పల్లి వెళ్లే దారిలో ఏమైందనే దానిపై అనుమానాలు ఉన్నాయని, వాటినీ నివృత్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

కుకునూర్‌పల్లి వరకు ఉన్న మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు వాటిని నిందితులకు చూపించి ధ్రువీకరించుకోవాల్సి ఉందని పిటిషన్‌లో ప్రస్తావించారు. కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్‌లో జరిగిన అంశాలను రూఢీ చేసుకోవాల్సి ఉందని, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి నిందితుల్ని విచారించాలని పేర్కొన్నారు.


మొదటి కాల్‌ రికార్డింగ్‌
నందు: డార్లింగ్‌. నాకు రికార్డింగ్‌ అయితే కనపడట్లేదు.
శిరీష: నీ పక్కన రవికి ఫోన్‌ ఇయ్‌.
నందు: రవియా..? నా పక్కన రవి ఎవరూ ఉండరు. నా పక్కన ఉండేది నవీన్‌.
శిరీష: ఊ.. వాడికివ్వు..
నవీన్‌: హలో..
శిరీష: హలో.. వాడు.. ఇందాక మాట్లాడింది నీతోనే కదా..?
నవీన్‌: ఆఆఆ
శిరీష:గుర్తుందా..శిరీషఇందాక మాట్లాడాను..
నవీన్‌: బాలకృష్ణ.. నాకైతే గుర్తుంది.. నీకైతే గుర్తుందా..?
శిరీష: ఆ..
నవీన్‌: గుర్తుంది.. ఇందాక మాట్లాడా శిరీష నీతోనే.. నేను నవీన్‌ మాట్లాడేది.నువ్వొక కాల్‌ రికార్డింగ్‌ పంపియ్యమన్నావు.. నువ్వే కదా?
శిరీష: నేనే నేనే.. వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్‌ కొంచెం వెతికి పంపించవా? కావాలంటే నంబర్‌ చెప్తాను దీనిది(తాను మాట్లాడుతున్న ఫోన్‌ది)..
నవీన్‌: ఇప్పుడు ఎవరు.. ఇందాక మాట్లాడిందా? దాన్నైతే(తేజస్విని) గలీజ్‌ గలీజ్‌ తిట్టి ––––– ఓకేనా..
శిరీష: తిట్టాడు కానీ నాకు ఆ రికార్డు కావాలి
నవీన్‌: ఓకే తను నీకేమవుద్ది? ఫ్రెండా? ఎనిమీ అయిద్దా?
శిరీష: ఎనిమీ.. నా ఎనిమీ అది(తేజస్విని)
నవీన్‌: ఇంక నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్‌ చూపెట్టాం దానికి.. దానికైతే టార్చర్‌ చూపెట్టాడు నందు.
శిరీష: నాకు రికార్డు కావాలి. ప్లీజ్‌.. అర్థం చేసుకోండి. ఎందుకు నన్నిలా చేస్తున్నారు?
నవీన్‌: శిరీష, శిరీష.. కాల్‌ రికార్డింగ్‌ ఆల్రెడీ ఆన్‌ ఉందా?(నందుని ఉద్దేశించి అడిగిన నవీన్‌). సారీ కొత్త ఫోన్‌ కదా మనోడు ఇంకా రికార్డింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలే..
శిరీష: ఇందాక దాంట్లో రికార్డింగ్‌ నోక్కాడు. రికార్డింగ్‌ ఆప్షన్‌ ఉంది వాడికి (నందుకు). ఫోన్లో రికార్డు అయింది ఆ..
నవీన్‌: ఒక్క నిమిషం శిరీష నేనే చెక్‌ చేస్తా.. ఒక్కసారి లైన్లో అట్లానే ఉండు. నువ్వు వాట్సాప్‌ నుంచి హాయ్‌ అని పంపు అట్లానే..
శిరీష: ఆ.. సరే..

రెండో కాల్‌ రికార్డింగ్‌..
శిరీష:హలో..హలో..(వెనక నుంచి గందర గో ళంతో కూడిన శబ్దాలు) ఏహే.. వాడు ప్రతి కాల్‌రికార్డింగ్‌ చేసుకుంటున్నా అన్నాడు నాతో..
నవీన్‌: లైన్‌లో అట్లానే ఉండు.. దానికి (తేజస్వినికి) ఫోన్‌ చేసి కలుపుతా.. నువ్వు కామ్‌గా ఉండు.
శిరీష: ఇంకా కెలికితే అది ఫైర్‌ అయిపోయి ఇష్టం వచ్చినట్లు చేస్తదేమో..
నవీన్‌: –––– ఏం కాదు. నందు ఉన్నాడు. నేనున్నాకదా. హైదరాబాద్‌ తోపులం. ఎట్లా అంటే హైదరాబాద్‌ మనదే ఓకేనా..
శిరీష: ఆహ్హా .. మీద ఫైర్‌ అవుతుంది కదా..
నవీన్‌: అట్లంటావా మామూలుగా అయితే దాన్ని కెలుకుతా. లైన్‌లో కలుపుతా ఓకేనా?
శిరీష: ఏయ్‌ వద్దు ఇంక వదిలేసెయ్యండి.
నవీన్‌: ఏం లేదు ఇప్పుడే మాట్లాడి పెట్టేసినం. అందరం మాట్లాడినం.. నేను, నందు.
శిరీష: ఏం మాట్లాడారు?
నవీన్‌: నువ్వెంత? నీ బతుకెంత అని మాట్లాడాడు నందు
శిరీష:దాన్నా..?
నవీన్‌: ఆ..
శిరీష: అయితే నువ్వేం మాట్లాడావు?
నవీన్‌: నేను.. నేను ఎవరు నువ్వనుకున్నా? ఈళ్ళ ఫ్రెండేమో అని గుంజుకుంది నేనే ఫోను. ఇప్పుడెందుకులే అని.. నందు మాట్లా డతాడు అంట మాట్లాడు..(ఫోన్‌ నందుకు ఇచ్చాడు)
శిరీష: హలో..
నందు: ఆ చెప్పు..
శిరీష: ఏమని తిట్టావురా దాన్ని..
నందు: నీ కెందుకు.. నీ –––, నీ––– అని తిట్టా ఓకేనా?
శిరీష: నా నంబర్‌ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం చెప్పావు?
నందు: అదేమీ మాట్లాడలా.. నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు అంది
శిరీష: ఏమంది?
నందు: నాకు ఆడు తెలుసు ఈడు తెలుసంది..
శిరీష:ఎవడు తెలుసంట? ఏమంటుంది? నీకు నంబర్‌ ఎవరిచ్చారు? చంపిస్తా? బెదిరిస్తా అంటోందా?
నందు: ఎవర్నీ నన్నా.. ఏంటి?
శిరీష:  ఏమంటోంది అసలు..?
నందు: ఏం లేదు సైలెంటైపోయింది. ఇంకోసారి నీకు కాల్‌ చెయ్యదు.
శిరీష:ఆ..నాక్కాదు రాజీవ్‌కి కాల్‌ చేసి బెదిరిస్తే..
నందు: చెయ్యదు. చేస్తే నాకు చెప్పు..
శిరీష: ఆ..
నందు: చెయ్యదు అన్నాగా..?
శిరీష:  రాజీవ్‌కు నాకు ఇద్దరికీ చెయ్యదుగా.. ష్యూర్‌..
నందు: చెయ్యదు. ఓసారి రాజీవ్‌తో ఈ నంబర్‌కు కాల్‌ చెయ్యమని చెప్పు.
శిరీష:  ఊ.. సరే చెప్తాలే. ఎందుకు పాపం తనను ఇన్‌వాల్వ్‌ చెయ్యడం, తన టెన్షన్స్‌ తనకు ఉన్నాయి.
నందు:ఒకసారి కాల్‌ చెయ్యమని చెప్పవే వాణ్ణి
శిరీష:ఆడు అంటా వేంట్రా? చంపేస్తా..
నందు: కుర్రోడే కదా.. మనోడే కదా..
శిరీష:  మనోడైతే రాజీవ్‌ అనొచ్చుగా..
నందు: నీ–––
శిరీష:  సరే.. నేను చెయ్యమంటాలే. ఆడు గీడు అనకు నాకు కోపం వస్తది. నువ్వైతే అది నా జోలికి, రాజీవ్‌ జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా.. హలో..
నందు: ఆఆఆ
శిరీష:  మా ఇద్దరి జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా..
నందు: సరే సరే..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement