తప్ప తాగి.. అధ్యక్షుడి కొడుకు చీప్‌ మాటలు | Benjamin Netanyahu's Son Brags About Prostitutes amd $20 Billion Deal | Sakshi
Sakshi News home page

తప్ప తాగి.. అధ్యక్షుడి కొడుకు చీప్‌ మాటలు

Published Wed, Jan 10 2018 4:39 PM | Last Updated on Wed, Jan 10 2018 4:39 PM

Benjamin Netanyahu's Son Brags About Prostitutes amd $20 Billion Deal - Sakshi

తనయుడు యెర్‌తో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహు (ఫైల్‌ ఫొటో)

టెల్‌ అవీవ్‌ : ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ తనయుడు యెర్‌ నెతన్యాహూ తన స్నేహితుడితో జరిపిన సంభాషణ ‘ఆడియో టేపు’ ప్రస్తుతం ఇజ్రాయెల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. టేపులో గ్యాస్‌ దిగ్గజం మొఘల్‌ కొబి మైమన్‌ తనయుడు ఒరి మైమన్‌తో యెర్‌ నెతన్యాహూ సంభాషించినట్లు తెలుస్తోంది. అప్పటికే తప్పతాగిన ఇరువురూ స్త్రీల గురించి, తండ్రుల గురించి చర్చించినట్లు టేపులో ఉంది.

2015లో ఒరి మైమన్‌తో కలసి యెర్‌ తరచుగా ప్రభుత్వ వాహనంలో స్ట్రిప్‌ క్లబ్స్‌కు వెళ్లారు. ఈ ఆడియో టేపు కూడా అప్పట్లో రికార్డు చేసిందే. ఆడియో టేపును ఇజ్రాయెల్‌ మీడియా దిగ్గజం చానెల్‌ 2 మంగళవారం ప్రసారం చేసింది.  

టేపులో ఏముందంటే..
యెర్‌ నెతన్యాహు (ఒరి మైమన్‌ను ఉద్దేశించి) : బ్రో.. నువ్వు నాకు ట్రీట్‌ ఇవ్వాలి. మీ డాడ్‌కు అనుకూలంగా మా నాన్న మంచి డీల్‌ కుదిర్చారు. పార్లమెంట్‌లో చట్టం పాస్‌ కాకుండా చూశారు. ఇందుకు ఆయన చాలా కష్టించారు. దానికి అదనంగా మీ కంపెనీకి 20 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కూడా ఇచ్చారు. నేను వేశ్య కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నాను. నువ్వు నా కోసం కనీసం 400 డాలర్లు కూడా ఖర్చు చేయలేవా?.

తీవ్ర వ్యతిరేకత
యెర్‌ నెతన్యాహు ఆడియో టేపులో చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌నే కాక ప్రపంచ దేశాలను కూడా విస్తుపోయేలా చేసింది. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన యెర్‌పై ఇజ్రాయెల్‌ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఆడియో టేపులో తన వ్యాఖ్యలపై స్పందించిన యెర్‌ నెతన్యాహూ ఇజ్రాయెల్‌ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. మహిళలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని చెప్పారు.

మద్యం మత్తులో చెప్పుకోలేని వ్యాఖ్యలు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని తనను చూడొద్దని కోరారు. తమ కుటుంబంపై బురద జల్లేందుకే మీడియా 2015లోని ఆడియో టేపును ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాగా, బెంజిమన్‌ నెతన్యాహు భార్య సారాపై ఇప్పటికే పలు అవినీతి కేసులు ఉన్నాయి. లక్షా పదివేల డాలర్ల చీటింగ్ కేసుతో పాటు, ప్రభుత్వ నిధులను విలాసవంతమైన విందులకు వినియోగించారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement