సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్‌ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్ తెలిపారు.
ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అధికారులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు సంబంధించినదిగా ఓ ఆడియో టేపు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు.
(చదవండి: తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment