సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్(పాత ప్రగతి భవన్) ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్‌కు పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
రోడ్డు ప్రమాద ఘటన తర్వాత.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు. ఇక.. ఇప్పటికే సాహిల్ అలియాస్ రాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రజా భవన్ ముందు సాహిల్ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక.. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపైనా వేటు వేశారు.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment