children injured
-
వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా.. -
దుర్గాదేవి నిమజ్జనం.. చిన్నారులకు తీవ్రగాయాలు
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : మండలంలోని పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా బాణసంచా పేలి ఐదుగురు చిన్నారు లు తీవ్రంగా కాలిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాణసంచా పేలుడు సంభవించి కె.వసంత్, ఎం.శ్రీను, ఎం.బాలకృష్ణ, డి. శ్యామ్, ఎ.తేజ తీవ్రంగా గాయపడ్డారు. ఇందు లో కె.వసంత్‌కు ముఖం పూర్తిగా కాలిపోవడం తో గుర్తుపట్టలేని విధంగా తయారైంది. తొలుత విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంలో విశాఖపట్నంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసంత్ ముఖానికి సర్జరీ చేయాలంటే సుమారు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఎం.శ్రీనుకు కాలు పూర్తిగా కాలిపోవ డంతో పరిస్థితి విషమంగా ఉంది. వీరు నిరుపేద కుటుంబాలకు చెందినవారు కావటంతో దా తల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు 99630 89699, 6301997993 నంబర్లను సంప్రదించా లని చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రవీణ్ గ్లాస్ వుడ్ యాజమాని కిల్లారి పైడినాయుడు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. దీనిపై జె.ఆర్.పురం ఎస్ఐ బి.అశోక్ బాబును వివరణ కోరగా ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఆడుకుంటున్న చిన్నారులపై పిచ్చికుక్క దాడి
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 18వ వార్డులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్ర సమయంలో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులపై దాడి చేసింది. ఇందులో ఒక బాలుడికి ముఖం నిండా తీవ్ర గాయాలయ్యాయి. 18వవార్డు ఎల్లమ్మవీధికి చెందిన పలువురు చిన్నారులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు స్కూలు నుంచి వచ్చి ఆడుకునేందుకు పార్కు వద్దకు చేరుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన పిచ్చికుక్క వీరిపై అమాంతం విరుచుకుపడింది. పురుషోత్తపురానికి చెందిన తలగాన రోహిత్ ముఖంపై తీవ్ర గాయాలు చేసింది. నుదురు, పెదవులపై దాడి చేసింది. పలాస కాపు వీధికి చెందిన డబ్బీరు ధనుకు చేతి ముక్క పీకేసింది. ధను అన్నయ్య డబ్బీరు దుష్యంత్‌పై దాడి చేసినా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. వీరితో పాటు సాయమ్మ, రోహిణి, హేమసుందర్ బెహరాకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. కుక్కకాటు సంబంధించిన వ్యాక్సిన్ ఆస్పత్రిలో లేకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు వైద్యులు కూడా లేకపోవడంతో శ్రీకాకుళం వెళ్లి వైద్యం చేయించుకోవాలని సిబ్బంది సూచించారు. రోహిత్ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు గంగాధర్, స్వాతి వెంటనే శ్రీకాకుళం తీసుకెళ్లారు. వ్యాక్సిన్ లేకపోవడంతో కొందరు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోయారు. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీలో కుక్కలు అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కుక్కల నిర్మూలనకు రూ.4లక్షలు ఖర్చు చూపించినా దస్త్రాలకే పరిమితం అయ్యాయి. -
కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు
సాక్షి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఓ కారు స్వైరవిహారం చేసింది. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. పిల్లలు గాయపడడంతో ఆ కారుని ఆపడానికి ప్రయత్నించిన రెండు వాహనాలను కూడా ఢీకొట్టి కారును నడుపుతున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు. పారిపోతున్న వాహనదారుడిని అశ్వారావుపేటలో స్థానికులు అడ్డగించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గా గుర్తించారు. -
వామ్మో...కుక్కలు...!
-
రాజధానిలో విషాదం
- ఆగి ఉన్న కారులో మంటలు - ఇద్దరు చిన్నారులకు గాయాలు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలు(2, 3 వయస్సు) రోజు మాదిరిగానే ఇంటి బయట ఆగి ఉన్న కారులో ఆడుకుంటున్నారు. అయితే, కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చిన్నారులు కేకలు వేసినప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ల అమ్మమ్మకు వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత తీవ్రమైన పొగలు రావటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బాలికలను బయటకు తీశారు. అప్పటికే వారికి 50 శాతం మేర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు స్టీరింగ్ దిగువ భాగంలోని తీగలు షార్ట్‌సర్క్యూట్‌కు గురై మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
దీపావళి ప్రమాదాలు.. కళ్లకు గాయాలు
-
‘సరోజిని’లో టపాసుల బాధితులు
హైదరాబాద్: దీపావళి పండగ రోజున పిల్లలకు ఎంతో సరదాగా ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండగ ముందే నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయినా ప్రతి ఏటా చిన్నారులు ప్రమాదానికి గురవుతున్నారు. దీపావళి వెలుగులు కొందరికి చీకట్లు తెచ్చిపెడుతున్నాయి. ఈ సారి కూడా బాణసంచా కాలుస్తూ కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. సుమారు 20 మంది బాధితులు కంటి సంబంధ సమస్యలతో సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. వారిలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలేనని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్ :పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులను లారీ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని హైదర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వసంతనగర్ కాలనీకి చెందిన సుశాంత్(13), విశ్వతేజ(10)లు సెయింట్ మేరీ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత తల్లి సురేఖతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా హైదర్‌నగర్ రహదారిపై వేగంగా దూసుకువస్తున్న లారీ వీరి వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుశాంత్ కు తీవ్రగాయాలు కాగా.. సురేఖ, విశ్వతేజాలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.