హైదరాబాద్ :పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులను లారీ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని హైదర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వసంతనగర్ కాలనీకి చెందిన సుశాంత్(13), విశ్వతేజ(10)లు సెయింట్ మేరీ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత తల్లి సురేఖతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా హైదర్‌నగర్ రహదారిపై వేగంగా దూసుకువస్తున్న లారీ వీరి వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో సుశాంత్ కు తీవ్రగాయాలు కాగా.. సురేఖ, విశ్వతేజాలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.