‘సరోజిని’లో టపాసుల బాధితులు
హైదరాబాద్: దీపావళి పండగ రోజున పిల్లలకు ఎంతో సరదాగా ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండగ ముందే నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయినా ప్రతి ఏటా చిన్నారులు ప్రమాదానికి గురవుతున్నారు. దీపావళి వెలుగులు కొందరికి చీకట్లు తెచ్చిపెడుతున్నాయి. ఈ సారి కూడా బాణసంచా కాలుస్తూ కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి గురైన వారు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. సుమారు 20 మంది బాధితులు కంటి సంబంధ సమస్యలతో సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. వారిలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలేనని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.