హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాణసంచా కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరిలోనూ ఈసారి దీపావళి కాంతులు తక్కువే కనిపిస్తున్నాయి. పెరిగిన ముడిపదార్థాల ధరలు, కార్మికుల కొరత, విక్రయాలకు స్థానిక సంస్థల అనుమతుల్లో జాప్యం, యాంటీ క్రాకర్ ప్రచారాలు బాణసంచా తయారీ పరిశ్రమపై ప్రభావాన్ని చూపిస్తే... పెద్ద నోట్ల రద్దు, పెరిగిన ధరలు, ఎడతెరిపిలేని వాన కొనుగోలుదారులను వెనకడుగు వేయించాయి.
మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఈసారి బాణసంచా తయారీ 40 శాతం తగ్గితే.. అమ్మకాలు ఇప్పటికి 50 శాతం పడిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నష్టం విలువ రూ.150 కోట్లకు పైమాటే!
రూ.2,500 కోట్ల మార్కెట్
దేశీ బాణాసంచా మార్కెట్ దాదాపు రూ.2,500 కోట్లు. అధికంగా తయారయ్యే శివకాశిలో అనుమతి పొందిన తయారీ సంస్థలు 800 వరకూ ఉన్నాయి. తయారీలో ప్రత్యక్షంగా 8 లక్షలు, పరోక్షంగా 2 లక్షల కార్మికులు నిమగ్నమయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏటా దసరా కంటే 10 రోజుల ముందే వ్యాపారం మొదలవుతుంది. దీపావళి తర్వాతి 15 రోజుల వరకూ ఉంటుంది.
దాదాపు 2 నెలల్లో ఏపీలో రూ.250 కోట్లు, తెలంగాణలో 100 కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలంగాణ క్రాకర్ సెల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మానిక్‌రావు చెప్పారు. తమిళనాడు దగ్గరగా ఉండటం, నౌకాశ్రయం, మెరుగైన రవాణా వ్యవస్థ కారణంగా తెలంగాణతో పోలిస్తే ఏపీకి బాణాసంచా తక్కువ ధరలకు దిగుమతి అవుతాయి. వ్యాపారమూ ఎక్కువే జరుగుతుంది. తెలంగాణలో జరిగే మొత్తం వ్యాపారంలో హైదరాబాద్ వాటానే రూ.50 కోట్లుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో నష్టం రూ.150 కోట్లు..
గతేడాదితో పోలిస్తే ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో బాణాసంచా వ్యాపారం బాగా పడిపోయిందని, ఈ విలువ 150 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. గతంలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (2), ఎక్సైజ్ (14.5), వ్యాట్ అన్నీ కలిపి 28.5 శాతం పన్నులుండేవి.
జీఎస్‌టీలో బాణాసంచాపై 28 శాతం పన్నుంది. దీంతో పన్నుల ప్రభావం లేకున్నా ఎడతెరిపిలేని వర్షాలు, బాణసంచా విక్రయాలకు జారీ చేసే తాత్కాలిక అనుమతుల్లో జాప్యం తీవ్ర ప్రభావాన్ని చూపించినట్లు మానిక్‌రావు తెలియజేశారు. గతంలో దసరా ముందే జారీ చేసే అనుమతులను ఈ ఏడాది కేవలం 4–5 రోజులకే పరిమితం చేశారని తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా ఇదే తీరుంది. పర్యావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో టపాసుల విక్రయాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించటమే దీనిక్కారణం’’ అని చెప్పారాయన.
అనుమతులకు తగ్గిన దరఖాస్తులు...
ఈ ఏడాది దేశవ్యాప్తంగా వ్యాపారం సన్నగిల్లడంతో అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులూ తగ్గాయి. గతేడాది తాత్కాలిక అనుమతు ల కోసం తెలంగాణలో 4 వేల వరకు దరఖాస్తులొస్తే.. ఈ ఏడాది 2,500–3,000కు పరిమితమయ్యాయి. ఇప్పటిదాకాదీపావళికి 2–3 రోజుల ముందు వరకు దాదాపు 60 శాతం అమ్మకాలు జరిగిపోయేవని, ఈసారి మాత్రం 20 శాతం అమ్మకాలు కూడా జరగలేదని సనత్‌నగర్ రెసిడెన్సీ క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టార్ ఫైర్‌వర్క్స్ యజమాని బాల్‌రాజ్ రెడ్డి చెప్పారు.
పిల్లల్లో బాణాసంచా మోజు తగ్గింది..!
ఈ ఏడాది ఎఫ్ మ్యాన్, వరల్డ్ వార్, సిల్వర్ రెయిన్, 100 పెప్పర్స్ వంటి 300 వెరైటీ క్రాకర్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటి ప్రారంభ ధరలు రూ.2 వేలు. అయితే గతంలో మాదిరి బాణాసంచా కాల్చడంపై పిల్లల్లో హుషారు తగ్గిందని మానిక్ రావు చెప్పారు. సుప్రీంకోర్టు ఢిల్లీలో నిషేధం విధించినా సామాజిక మాధ్యమాలతో విషయం అన్ని ప్రధాన నగరాలకూ పాకిందని చెప్పారు.
నిజానికి ఈ విషయమై హైదరాబాద్‌తో పాటు 15 ప్రధాన నగరాల్లో అసోచామ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఓ సర్వే చేసింది. దీన్లో పాల్గొన్నవారు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆహ్వానించారు. ‘‘టపాసులతో పాటు రోడ్ల తవ్వకాలు, వాహన కాలుష్యం, చెత్త, ఎలక్ట్రానిక్స్‌ను కాల్చడం వంటివి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలుష్య ప్రభావం పర్యావరణంపైనే కాదు. పర్యాటకం, ఔట్‌డోర్ రిక్రియేషన్‌తో పాటు అంతిమంగా బ్రాండ్ ఇండియాపై పడుతుంది’’ అని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు.
మన నిర్ణయాలు... చైనాకు ఊతం!
♦ పెద్ద నోట్ల రద్దు బాణాసంచా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రోజువారీ వేతన కార్మికులతో నడిచే ఈ పరిశ్రమలో నగదు విత్‌డ్రా పరిమితుల వల్ల చాలామంది తయారీనే ప్రారంభించలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి బాణాసంచా తయారీ 40 శాతం సగానికి తగ్గిందనేది పరిశ్రమ వర్గాల మాట. మొత్తం టపాసుల అమ్మకాల్లో ఢీల్లీ–ఎన్‌సీఆర్ వాటా 25 శాతం. అక్కడి నిషేధంతో మార్కెట్ పూర్తిగా దెబ్బతింది.
♦ దేశంలో చైనా బాణాసంచా మార్కెట్ వాటా 20% వరకూ ఉంది. తక్కువ ధర, ఎక్కువ వెరైటీలనేవి వీటి బలం. జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లను తొలగించారు. దీంతో అక్ర మ బాణసంచా రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోయింది.
♦ గతంలో రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కంటే తక్కువున్న బాణాసంచా తయారీ సంస్థలకు సెంట్రల్ ఎక్సైజ్ నుంచి మినహాయింపు ఉంది. 14.5 శాతం వ్యాట్, సెంట్రల్
Comments
Please login to add a commentAdd a comment