సాక్షి,న్యూఢిల్లీ: నీతి సూక్తులు వద్దుబాబు.. నీవేమన్న సుద్దపూసవా..?అంటూ టీమిండియా క్రికెటర్ యువరాజ్‌సింగ్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనికి కారణం దీపావళికి ఫైర్ క్రాకర్స్ నిషేదిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు యువరాజ్ మద్దతు తెలుపుతూ.. పటాకులు వద్దు..దీపాలు ముద్దు అని ఫ్యాన్స్‌కు పిలుపు నివ్వడమే. యువీ ‘దీపావళికి ఫైర్ క్రాకర్స్ వద్దు.. దీపాలతో ఈ దీపావళిని జరుపుకుందాం. కాలుష్యంతో మనకు, మన పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఓ వీడియో మెసేజ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
అయితే నెటిజన్లు యువరాజ్ పెళ్లి సంబరాల ఫోటోలను ప్రస్తావిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పెళ్లికి పటాకులు కాలిస్తే కాలుష్యం కాదు..కానీ దీపావళికి కాలిస్తే వాతావరణం దెబ్బతింటుంది కదా యువరాజ్ అంటూ కొందరూ.. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ విషవాయువులు రిలీజ్ చేస్తాయి. కానీ యువీ పెళ్లి వేడుకల్లో మాత్రం ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని వంగ్యచలోక్తులు విసురుతున్నారు.
Hello Yuvraj Singh, Crackers creates pollution during diwali and not during your wedding! pic.twitter.com/Pzqw1YtPPD
— Mishra Vikas (@camishravikas) 9 October 2017
Pic 1:Yuvraj Singh Supports #FirecrackerBan on Diwali
— Ashwin Pagare (@pagareashwin) 13 October 2017
Pic 2:On his Wedding,crackers Produced Oxygen & Delhi was Pollution Free#Hypocrites pic.twitter.com/CxFD0Mpmdh
Comments
Please login to add a commentAdd a comment