youvaraj
-
యోయో..ఏంటీ..యువీ జట్టులోకి రావాలి..!
దుబాయ్: గత కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్రైనాలు తిరిగి జట్టులోకి రావాలని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆకాంక్షించారు. దుబాయ్‌లోని ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించే యోయో టెస్టుపై తనకు అంత అవగాహన లేదన్నాడు. ‘ఆటగాళ్లు ఫిట్నెస్గా ఉండటం తప్పనిసరి, ఫిట్‌గా లేకుంటే ఆడలేరు. కానీ కెరీర్ మంచి దశలో ఉండి ఆనారోగ్యానికి గురైన కొంత మంది సీనియర్ క్లికెటర్లకు ఈ పరీక్షల నుంచి కొంత మేర మినహాయించాలి. యువరాజ్‌ను తీసుకుంటే 2011 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్‌తో బాధపడ్డాడు. దీంతోనే యోయో టెస్ట్ నెగ్గలేకపోతున్నాడుని అనుకుంటున్నా. ఇక సురేశ్ రైనాకు నేను పెద్ద అభిమానిని. అతను కూడా జట్టులోకి తిరిగి రావాలనొ కోరుకుంటున్నా. గతేడాది అతని కలిసినప్పుడు అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఏదేమైనా తుదినిర్ణయం మాత్రం జట్టుదేనని అజార్ చెప్పుకొచ్చాడు. -
యువరాజ్‌పై గృహహింస కేసు..
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస కేసు నమోదైంది. సోదరుడు జోరవర్ సింగ్ భార్య, బిగ్ బాస్-10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువరాజ్‌సింగ్‌తో పాటు భర్త జోరవర్ సింగ్, అత్త షబ్నం సింగ్‌లపై కేసుపెట్టినట్లు ఆమె లాయర్ స్వాతి సింగ్ తెలిపారు. చాల రోజుల నుంచి ఆకాంక్ష జరోవర్లు విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవల యువరాజ్ తల్లి షబ్నం కూడా కేసు వేసింది. అయితే ఈ గృహహింస కేసు యువరాజ్‌పై ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించగా.. శారీరక హింస కింద మాత్రమే ఈ కేసు నమోదు చేయరు మానసికంగా, ఆర్ధికంగా ఒత్తిడి తీసుకురావడం, అందుకు సహకరించిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చిని లాయర్ స్వాతి తెలిపారు. బిడ్డ కావాలంటూ జరోవర్, షబ్నం ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయంలో యువీ వారి కుటుంబ సభ్యులకు వత్తాసు పలుకుతున్నాడు. అందుకే అతని పేరు జతచేయాల్సి వచ్చిందన్నారు. -
నీతి సూక్తులు వద్దు బాబు.. నెటిజన్ల ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: నీతి సూక్తులు వద్దుబాబు.. నీవేమన్న సుద్దపూసవా..?అంటూ టీమిండియా క్రికెటర్ యువరాజ్‌సింగ్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనికి కారణం దీపావళికి ఫైర్ క్రాకర్స్ నిషేదిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు యువరాజ్ మద్దతు తెలుపుతూ.. పటాకులు వద్దు..దీపాలు ముద్దు అని ఫ్యాన్స్‌కు పిలుపు నివ్వడమే. యువీ ‘దీపావళికి ఫైర్ క్రాకర్స్ వద్దు.. దీపాలతో ఈ దీపావళిని జరుపుకుందాం. కాలుష్యంతో మనకు, మన పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఓ వీడియో మెసేజ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే నెటిజన్లు యువరాజ్ పెళ్లి సంబరాల ఫోటోలను ప్రస్తావిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పెళ్లికి పటాకులు కాలిస్తే కాలుష్యం కాదు..కానీ దీపావళికి కాలిస్తే వాతావరణం దెబ్బతింటుంది కదా యువరాజ్ అంటూ కొందరూ.. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ విషవాయువులు రిలీజ్ చేస్తాయి. కానీ యువీ పెళ్లి వేడుకల్లో మాత్రం ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని వంగ్యచలోక్తులు విసురుతున్నారు. Hello Yuvraj Singh, Crackers creates pollution during diwali and not during your wedding! pic.twitter.com/Pzqw1YtPPD — Mishra Vikas (@camishravikas) 9 October 2017 Pic 1:Yuvraj Singh Supports #FirecrackerBan on Diwali Pic 2:On his Wedding,crackers Produced Oxygen & Delhi was Pollution Free#Hypocrites pic.twitter.com/CxFD0Mpmdh — Ashwin Pagare (@pagareashwin) 13 October 2017 -
ఫ్యాన్స్‌కు యువీ స్పెషల్ మెసేజ్..
సాక్షి, హైదరాబాద్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ ప్రత్యేక సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చవద్దని, పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.‘ క్రాకర్స్ వద్దు.. కాలుష్యం లేని దీపావళిని జరుపుకుందాం.’అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో యూవీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. గతేడాది కాలుష్యంతో తను బాధపడిని విషయాన్ని గుర్తు చేశారు. ‘ ప్రతి ఒక్కరికీ హలో..నమస్కార్..నమస్తే..సలామ్.. ఈ దీపావళికి ఎవరూ క్రాకర్స్‌ను కాల్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. గతేడాది మనదేశంలో దీపావళి సందర్భంగా విపరీతమైన కాలుష్యం చోటుచేసుకుంది. దీంతో గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది కలిగింది. నేనైతే మా ఇంటి నుంచి కూడా బయటకు రాలేకపోయా. పటాకులు కాల్చుతూ పండుగ చేసుకోవడం ప్రకృతికి విరుద్దం, మనం, మన పిల్లలు, తల్లితండ్రులు, ప్రతి ఒక్కరు ఆనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. ఇది దీపాల పండుగ. కాబట్టి ప్రేమ, శాంతిలను పంచుతూ దీపాలతో సంబరాలు చేసుకుందాం. అలాగే అలయ్-బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొండి. స్వీట్లు తినండి. కార్డ్స్ ఆడండి. కానీ ఫైర్ క్రాకర్స్ మాత్రం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారు. ఇలా వారిని చూడటం మనకు సిగ్గుచేటు. ఈ పండుగకు కాలుష్యం నుంచి మన దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకొండి. దయచేసి క్రాకర్స్ జోలికి వెళ్లొద్దు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.’ అని యువీ వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దేశ రాజధాని న్యూఢిల్లీలో పటాకుల అమ్మకంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో యువరాజ్ కాలుష్యం నుంచి దేశాన్ని రక్షించాలని అభిమానులకు సూచించడం పట్ల ప్రకృతి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Say no to crackers, let’s celebrate a pollution free Diwali 🙏 #saynotocrackers #pollutionfree pic.twitter.com/l1sotpKizM — yuvraj singh (@YUVSTRONG12) 8 October 2017 -
ఆ రికార్డు సచిన్ తర్వాత యువరాజ్‌దే..
లండన్: చాంపియన్స్ట్రోఫిలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అత్యధిక ఐసీసీ టోర్నిలు ఆడిన తొలి ప్లేయర్‌గా నిలిచిన యువీ, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐసీసీ టోర్నిల్లో భారత్ తరుపున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నరికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా ఆ తరువాతి స్థానంలో యువీ నిలిచాడు. సచిన్ 10 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకోగా యువీ నిన్నటి దానితో కలిపి 9 అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ యువీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఐసీసీ టోర్నిల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ (11) అందుకొని అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో సచిన్, యువరాజ్లున్నారు. ICC tournaments get the best out of @YUVSTRONG12 . His 9th Man of the Match, only second to Sachin Paaji's 10 . A real champ.#IndvsPak — Mohammad Kaif (@MohammadKaif) 5 June 2017 -
పాలనలో రాణిస్తే ప్రజలలో గుర్తింపు
పెదవాల్తేరు : జిల్లాని అన్ని రంగాలలో అభివద్ధి పరిచేందుకు కషి చేసినప్పడే అధికారిగా ప్రజల హదయాలలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకోగలగుతామని,అలాంటి గురుతరబాధ్యతను డాక్టర్ ఎన్.యువరాజ్ సమర్థవంతంగా నిర్విర్తించారని విశాఖ పోర్టుట్రస్ట్ ఛైర్మెన్ ఎం.టి.కష్ణబాబు అన్నారు. విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులు,ఎంపీడీవోలు సోమవారం హోటల్ గ్రీన్‌పార్కులో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోర్టుఛైర్మన్ మాట్లాడుతూ ప్రజాప్రతిని«ధులను, అధికారులను సమన్వయం పరుస్తూ జిల్లాని గాడిలోపెట్టడంలో తనదైన మార్కు వేశారన్నారు. కలెక్టర్ హోదాలో తాము చేసిన పనుల వలన వచ్చే ఫలితాలను స్వయంగా చూసుకోవచ్చున్నారు. దానివలన ఎంతో సంతప్తి వుంటుందన్నారు. ఇక జిల్లా కలెక్టర్‌గా నియామాకమైన ప్రవీణ్‌కుమార్‌కు జిల్లాలో మంచి అనుభవంవుందన్నారు. జాయింట్ కలెక్టర్‌గా, జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసి తానెంటో అభివద్ధి చేసి నిరూపించుకున్నారన్నారు. అనంతరం అటవీశాఖ అడిషనల్ చీఫ్ కన్వర్జర్వేటర్ ప్రదీప్మాట్లాడుతూ యువరాజ్ కలెక్టర్‌గా తనదైన ముద్రవేశారన్నారు. పోలీసు కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ కలెక్టర్‌గా జిల్లావాసులు హదయాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్‌గా ఆయన దగ్గర పనిచేసి సమయంలో ఆయన పాలన శైలిని గమనించి, చాలా తెలుసుకునన్నారు. అనంతరం యువరాజ్ మాట్లాడుతూ మూడున్నరేళ్ళగా ఇక్కడ పనిచేసిన మంచి తీపి జ్ఞాపకాలతో వెళ్తున్నారన్నారు. ఐఎఎస్ శిక్షణ లోభాగంగా ఎం.టి.కష్ణబాబు గారివద్ద పనిచేసినప్పడు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. వ్యక్తి వ్యక్తిగా చూసినప్పడే వారి బాధలను అర్థంచేసుకోగలమన్నారు.తనకు అలాంటి వ్యక్తిత్వం తన తల్లిదండ్రులనుంచే వచ్చిందేనన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. యువరాజ్‌కు గజమాలతో ఘనంగా సత్కరించారు. -
సింహాచలంలో యువరాజ్
సింహాచలంః శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామిని యువరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కలెక్టరుగా పనిచేసిన కాలంలో ఏమైనా చేయాలనుకున్న పనులు చేయలేక అసంతప్తితో ఉన్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ..సింహాచలంలో బీఆర్టీఎస్ పనులు పూర్తి చేయలేకపోయామన్నారు. ఒక కొలిక్కి వచ్చినా అది పూర్తికాలేదన్నారు. ప్రస్తుత కలెక్టరు ప్రవీణ్‌కుమార్ ఆ పనులు పూర్తిచేస్తారన్నారు. అలాగే సింహగిరి కొండలోంచి టర్నల్ ఏర్పాటు ఒకటన్నారు. వైదికవర్గాలను, పబ్లిక్‌ను ఒప్పించి చేయలేకపోయామన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఎంతో మహిమ గల దేవుడని, ఇక్కడ ఎంతో ప్రశాంతత ఉంటుందని తెలిపారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఈవొ కె.రామచంద్రమోహన్ అందజేశారు.