
సాక్షి, హైదరాబాద్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ ప్రత్యేక సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చవద్దని, పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.‘ క్రాకర్స్ వద్దు.. కాలుష్యం లేని దీపావళిని జరుపుకుందాం.’అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేశాడు.
ఆ వీడియోలో యూవీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. గతేడాది కాలుష్యంతో తను బాధపడిని విషయాన్ని గుర్తు చేశారు. ‘ ప్రతి ఒక్కరికీ హలో..నమస్కార్..నమస్తే..సలామ్.. ఈ దీపావళికి ఎవరూ క్రాకర్స్‌ను కాల్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. గతేడాది మనదేశంలో దీపావళి సందర్భంగా విపరీతమైన కాలుష్యం చోటుచేసుకుంది. దీంతో గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది కలిగింది. నేనైతే మా ఇంటి నుంచి కూడా బయటకు రాలేకపోయా. పటాకులు కాల్చుతూ పండుగ చేసుకోవడం ప్రకృతికి విరుద్దం, మనం, మన పిల్లలు, తల్లితండ్రులు, ప్రతి ఒక్కరు ఆనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. ఇది దీపాల పండుగ. కాబట్టి ప్రేమ, శాంతిలను పంచుతూ దీపాలతో సంబరాలు చేసుకుందాం. అలాగే అలయ్-బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొండి. స్వీట్లు తినండి. కార్డ్స్ ఆడండి. కానీ ఫైర్ క్రాకర్స్ మాత్రం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారు. ఇలా వారిని చూడటం మనకు సిగ్గుచేటు. ఈ పండుగకు కాలుష్యం నుంచి మన దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకొండి. దయచేసి క్రాకర్స్ జోలికి వెళ్లొద్దు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.’ అని యువీ వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో పటాకుల అమ్మకంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో యువరాజ్ కాలుష్యం నుంచి దేశాన్ని రక్షించాలని అభిమానులకు సూచించడం పట్ల ప్రకృతి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Say no to crackers, let’s celebrate a pollution free Diwali 🙏 #saynotocrackers #pollutionfree pic.twitter.com/l1sotpKizM
— yuvraj singh (@YUVSTRONG12) 8 October 2017
Comments
Please login to add a commentAdd a comment