
దుబాయ్: గత కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్‌రైనాలు తిరిగి జట్టులోకి రావాలని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆకాంక్షించారు. దుబాయ్‌లోని ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించే యోయో టెస్టుపై తనకు అంత అవగాహన లేదన్నాడు.
‘ఆటగాళ్లు ఫిట్‌నెస్‌గా ఉండటం తప్పనిసరి, ఫిట్‌గా లేకుంటే ఆడలేరు. కానీ కెరీర్ మంచి దశలో ఉండి ఆనారోగ్యానికి గురైన కొంత మంది సీనియర్ క్లికెటర్లకు ఈ పరీక్షల నుంచి కొంత మేర మినహాయించాలి. యువరాజ్‌ను తీసుకుంటే 2011 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్‌తో బాధపడ్డాడు. దీంతోనే యోయో టెస్ట్ నెగ్గలేకపోతున్నాడుని అనుకుంటున్నా. ఇక సురేశ్ రైనాకు నేను పెద్ద అభిమానిని. అతను కూడా జట్టులోకి తిరిగి రావాలనొ కోరుకుంటున్నా. గతేడాది అతని కలిసినప్పుడు అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఏదేమైనా తుదినిర్ణయం మాత్రం జట్టుదేనని అజార్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment