సింహాచలంలో యువరాజ్
Published Mon, Jul 25 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
సింహాచలంః శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామిని యువరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కలెక్టరుగా పనిచేసిన కాలంలో ఏమైనా చేయాలనుకున్న పనులు చేయలేక అసంతప్తితో ఉన్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ..సింహాచలంలో బీఆర్‌టీఎస్ పనులు పూర్తి చేయలేకపోయామన్నారు. ఒక కొలిక్కి వచ్చినా అది పూర్తికాలేదన్నారు. ప్రస్తుత కలెక్టరు ప్రవీణ్‌కుమార్ ఆ పనులు పూర్తిచేస్తారన్నారు. అలాగే సింహగిరి కొండలోంచి టర్నల్ ఏర్పాటు ఒకటన్నారు. వైదికవర్గాలను, పబ్లిక్‌ను ఒప్పించి చేయలేకపోయామన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఎంతో మహిమ గల దేవుడని, ఇక్కడ ఎంతో ప్రశాంతత ఉంటుందని తెలిపారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఈవొ కె.రామచంద్రమోహన్ అందజేశారు.
Advertisement