ఆ రికార్డు సచిన్ తర్వాత యువరాజ్‌దే..
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు సచిన్ తరువాత యువీ..
లండన్: చాంపియన్స్‌ట్రోఫిలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అత్యధిక ఐసీసీ టోర్నిలు ఆడిన తొలి ప్లేయర్‌గా నిలిచిన యువీ, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఐసీసీ టోర్నిల్లో భారత్ తరుపున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నరికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా ఆ తరువాతి స్థానంలో యువీ నిలిచాడు. సచిన్ 10 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకోగా యువీ నిన్నటి దానితో కలిపి 9 అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ యువీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఐసీసీ టోర్నిల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ (11) అందుకొని అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో సచిన్, యువరాజ్‌లున్నారు.