పాలనలో రాణిస్తే ప్రజలలో గుర్తింపు
Published Tue, Jul 26 2016 12:13 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
పెదవాల్తేరు : జిల్లాని అన్ని రంగాలలో అభివద్ధి పరిచేందుకు కషి చేసినప్పడే అధికారిగా ప్రజల హదయాలలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకోగలగుతామని,అలాంటి గురుతరబాధ్యతను డాక్టర్ ఎన్.యువరాజ్ సమర్థవంతంగా నిర్విర్తించారని విశాఖ పోర్టుట్రస్ట్ ఛైర్మెన్ ఎం.టి.కష్ణబాబు అన్నారు. విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులు,ఎంపీడీవోలు సోమవారం హోటల్ గ్రీన్‌పార్కులో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోర్టుఛైర్మన్ మాట్లాడుతూ ప్రజాప్రతిని«ధులను, అధికారులను సమన్వయం పరుస్తూ జిల్లాని గాడిలోపెట్టడంలో తనదైన మార్కు వేశారన్నారు. కలెక్టర్ హోదాలో తాము చేసిన పనుల వలన వచ్చే ఫలితాలను స్వయంగా చూసుకోవచ్చున్నారు. దానివలన ఎంతో సంతప్తి వుంటుందన్నారు. ఇక జిల్లా కలెక్టర్‌గా నియామాకమైన ప్రవీణ్‌కుమార్‌కు జిల్లాలో మంచి అనుభవంవుందన్నారు. జాయింట్ కలెక్టర్‌గా, జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసి తానెంటో అభివద్ధి చేసి నిరూపించుకున్నారన్నారు. అనంతరం అటవీశాఖ అడిషనల్ చీఫ్ కన్వర్జర్వేటర్ ప్రదీప్‌మాట్లాడుతూ యువరాజ్ కలెక్టర్‌గా తనదైన ముద్రవేశారన్నారు. పోలీసు కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ కలెక్టర్‌గా జిల్లావాసులు హదయాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్‌గా ఆయన దగ్గర పనిచేసి సమయంలో ఆయన పాలన శైలిని గమనించి, చాలా తెలుసుకునన్నారు.
అనంతరం యువరాజ్ మాట్లాడుతూ మూడున్నరేళ్ళగా ఇక్కడ పనిచేసిన మంచి తీపి జ్ఞాపకాలతో వెళ్తున్నారన్నారు. ఐఎఎస్ శిక్షణ లోభాగంగా ఎం.టి.కష్ణబాబు గారివద్ద పనిచేసినప్పడు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. వ్యక్తి వ్యక్తిగా చూసినప్పడే వారి బాధలను అర్థంచేసుకోగలమన్నారు.తనకు అలాంటి వ్యక్తిత్వం తన తల్లిదండ్రులనుంచే వచ్చిందేనన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. యువరాజ్‌కు గజమాలతో ఘనంగా సత్కరించారు.
Advertisement