యువరాజ్‌పై గృహహింస కేసు.. | Yuvraj Singh Booked for Domestic Violence by Sister-in-Law Akanksha Sharma | Sakshi
Sakshi News home page

యువరాజ్‌పై గృహహింస కేసు..

Published Wed, Oct 18 2017 12:00 PM | Last Updated on Wed, Oct 18 2017 12:12 PM

 Yuvraj Singh Booked for Domestic Violence by Sister-in-Law Akanksha Sharma

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై గృహహింస కేసు నమోదైంది.  సోదరుడు జోరవర్‌ సింగ్‌ భార్య, బిగ్‌ బాస్‌-10 కంటెస్టెంట్‌ ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువరాజ్‌సింగ్‌తో పాటు భర్త జోరవర్‌ సింగ్‌, అత్త  షబ్నం సింగ్‌లపై కేసుపెట్టినట్లు ఆమె లాయర్‌ స్వాతి సింగ్‌ తెలిపారు. చాల రోజుల నుంచి ఆకాంక్ష జరోవర్‌లు విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవల యువరాజ్‌ తల్లి షబ్నం కూడా కేసు వేసింది.

అయితే ఈ గృహహింస కేసు యువరాజ్‌పై ఎలా నమోదు చేస్తారని  ప్రశ్నించగా.. శారీరక హింస కింద మాత్రమే ఈ కేసు నమోదు చేయరు మానసికంగా, ఆర్ధికంగా ఒత్తిడి తీసుకురావడం, అందుకు సహకరించిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చిని లాయర్‌ స్వాతి తెలిపారు. బిడ్డ కావాలంటూ జరోవర్‌, షబ్నం ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయంలో యువీ వారి కుటుంబ సభ్యులకు వత్తాసు పలుకుతున్నాడు. అందుకే అతని పేరు జతచేయాల్సి వచ్చిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement