దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది.
రాజధానిలో విషాదం
Mar 23 2017 4:32 PM | Updated on Sep 5 2017 6:54 AM
- ఆగి ఉన్న కారులో మంటలు
- ఇద్దరు చిన్నారులకు గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క‍్యూట్ కారణంగా ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలు(2, 3 వయస్సు) రోజు మాదిరిగానే ఇంటి బయట ఆగి ఉన్న కారులో ఆడుకుంటున్నారు. అయితే, కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చిన్నారులు కేకలు వేసినప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ల అమ్మమ్మకు వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత తీవ్రమైన పొగలు రావటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బాలికలను బయటకు తీశారు. అప్పటికే వారికి 50 శాతం మేర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు స్టీరింగ్ దిగువ భాగంలోని తీగలు షార్ట్‌సర్క్యూట్‌కు గురై మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
Advertisement