దమ్మపేట, న్యూస్‌లైన్ : దమ్మపేట మండలం జమేదార్ బంజర్, లింగాలపల్లి పంచాయతీల లో ఎన్నికల పోరు శనివారం హోరాహోరీగా జరిగింది. జమేదార్‌బంజర్‌లో వైఎస్‌ఆర్ కాం గ్రెస్ మద్దతుదారు దండి దుర్గ టీడీపీ మద్దతుదారు రాచూరి రేఖపై 80 ఓట్ల ఆధిక్యతతో గెలుపొం దారు. ఇక్కడ 1072 ఓట్లకు గాను, 998 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుర్గకు 422 ఓట్లు రాగా, రేఖకు 342 ఓట్లు వచ్చాయి. న్యూడెమోక్రసీ మద్దతుతో పోటీచేసిన ఘంటా దుర్గకు 174 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 10 వార్డులకు గాను వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు 6 వార్డులు, టీడీపీ 2, న్యూడెమోక్రసీ బలపర్చిన వారు 2 వార్డుల్లో గెలుపొందారు.
లింగాలపల్లిలో 927 ఓట్లకు గాను, 837 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ న్యూడెమోక్రసీ మద్దతుతో పోటీ చేసిన సున్నం లక్ష్మి విజయం సాధించారు. ఆమెకు 376 ఓట్లు రాగా, తెలుగుదేశం బలపర్చిన వాడె లతకు 243 ఓట్లు వచ్చా యి. వైఎస్సార్ సీపీ బలపర్చిన సోయం చిలకమ్మకు 177 ఓట్లు వచ్చాయి.
న్యూడెమోక్రసీ మద్దతుదారులు 8 వార్డులు, టీడీపీ బలపర్చిన వారు 2 వార్డులను గెలుచుకున్నారు. ఈ రెండు పంచాయితీల్లోనూ టీడీపీ మండల నాయకులంతా బృందంగా ఏర్పడి ప్రచా రం చేసినా ఓటర్లు పెద్దగా స్పందించలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయి. జమేదార్ బంజర్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఆ పార్టీ మరో పంచాయతీని తన ఖాతాలో జమచేసుకుంది.
ఫలితాల అనంతరం ఆ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, నాయకులు దారా యుగంధర్, జూపల్లి ఉపేంద్రబాబు, చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, పాకనాటి శ్రీను, ఓంకార కృష్ణకుమార్, చవ్వా పోలారావు, చక్రాల మల్లేశ్వరరావు, ఎస్‌కె షుకూర్, పాశం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సోయం రాజబా బు, జంగాల సర్వేశ్వరరావు పాల్గొన్నారు.