కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన హోంగార్డు సిరసాని రాంబాబు(సస్పెన్షన్‌లో ఉన్నారు) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా జిల్లా హోంగార్డుల వాట్సాప్ గ్రూప్‌లో శుక్రవారం మెసేజ్ పెట్టడం పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ మృతి విషయం మరువకముందే.. ఈ మెసేజ్ పెట్టడం, విషయం ఆనో టా ఈనోటా బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సిరసాని రాంబాబుతో ‘సాక్షి’మాట్లాడగా, హోంగార్డులు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, చాలీచాలని జీతంతో ఇబ్బందిపడుతున్నారని వాపోయాడు.
కల్లూరులో భూమి విషయంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కొందరు తన తల్లిదండ్రులపై ఫిబ్రవరి 10న దాడి చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయాన వేరే ప్రాంతంలో ఉన్న తాను ఫిబ్రవరి 28న ఎస్‌ఐ పి.రఘుతో కేసు విషయమై మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప డమేకాక ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహ త్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఆరోపణల్లో వాస్తవం లేదు: ఎస్‌ఐ
సస్పెండ్ అయిన హోంగార్డు సిరసాని రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కల్లూరు ఎస్‌ఐ పి.రఘు స్పష్టం చేశారు. భూమి అక్రమంగా ఆయనే ఆక్రమించాడని, ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. గతంలో తోటి హోంగార్డును కొట్టి సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్లి రాగా, కొంత కాలానికి విధుల్లో తీసుకున్నట్లు తెలిపారు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోగా, మద్యం సేవించి విధులకు వస్తుండడంతో సస్పెండ్ చేశారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment