కాల్‌మనీ వేధింపులు: మరొకరి ఆత్మహత్య | Call Money Victim Commit Suicide Over harassments | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ వేధింపులు: మరొకరి ఆత్మహత్య

Published Thu, Jan 21 2016 12:20 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

Call Money Victim Commit Suicide Over harassments

రేపల్లె: కాల్‌మనీ వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో గురువారం వేకువజామున చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కదరవల్లి రాంబాబు(58) స్థానికంగా గరికపాటి రవి అనే వ్యాపారి నుంచి 8 ఏళ్ల క్రితం రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
 
ప్రస్తుతం ఆ రుణానికి సంబంధించి వడ్డీయే రూ. 24 లక్షలయింది. మరో వ్యక్తి వేమూరి శ్రీను దగ్గర రూ.1.50 లక్షలు అప్పు తీసుకోగా దానికి వడ్డీ రూ. 2లక్షలకు చేరుకుంది. అప్పుల వారి నుంచి వేధింపులు తీవ్రం కావటంతో ఈనెల 19వ తేదీన తమ స్వగ్రామం బొబ్బర్లంక వెళ్లి పొలంలోనే పురుగు మందు తాగి చనిపోయాడు. మరణ వార్త విని స్వగ్రామానికి చేరుకున్న కుమారుడు తండ్రి చొక్కా జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను గమనించి, ఆమేరకు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చౌడాయపాలెం ఇన్‌చార్జి ఎస్సై మహ్మద్ షఫీ దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు ఇద్దరు కుమారులు ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement