నోట్ల కష్టాలు ఇప్పట్లో తొలగే అవకాశాలు లేవని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏపీటీబీఈఎఫ్) తెలిపింది. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) అవలంభిస్తోన్న విధానాలు తప్పుల తడకగా ఉన్నాయని మండి పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 నెలల పాటు జీతాల చెల్లింపు కష్టమేనని ఏపీటీబీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. దేశంలోని ముద్రణాలయాలు పూర్తిస్థాయిలో పనిచేసిన నోట్ల కొరత తీరదని తెలిపారు.