
రాంబాబుకు కన్నీటి వీడ్కోలు
మోతె: హిమాచల్‌ప్రదేశ్‌లో విహారయాత్రకు వెళ్లి నదిలో పడి మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థి బానోతు రాంబాబుకు ఆయన స్వగ్రామమైన మోతె మండలం భీక్యాతండాలో మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. రాంబాబు మృతదేహం మంగళవారం తెల్లవారుజామున తీసుకువచ్చారు. ఈ విష యం తెలిసిన వెంటనే గ్రామస్తులతో పాటు మృతుని బంధువులు, మిత్రులు, పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం ఉదయం 9గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. రాంబాబు మృతదేహానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాంబాబు మృతికి కారణమైన హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించి మృతుని కుటుం బానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాంబాబు అంతిమయాత్రలో టీఆర్‌ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, జెడ్పీటీసీ సభ్యురాలు శీలం ఉమాసైదులు, మోతె మండల కాంగ్రెస్ నాయకులు ఆరె లింగారెడ్డి, గట్టికొప్పుల వీరారెడ్డి, మాతృనాయక్, పి పుల్లారావు, చిన వెంకటరెడ్డి, ఆర్‌కె నాయక్ గురుకృష్ణ, చంద్రునాయక్, స్వామినాయక్, నర్సింహనాయక్, వీరన్న నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, మైనంపాటి ప్రభాకర్‌రెడ్డి, కామళ్ల కోట య్య, ఉన్నం సత్యనారాయణరావు, కోట రాంరెడ్డి, మహేష్, హరిబాబు, కృష్ణ, ప్రసాద్, ఇన్‌చార్జి తహసీల్దార్ హుస్సేన్, ఆర్‌ఐ శైలజ, గ్రామ సర్పంచ్ గౌని రమణగోపాల్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.