సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో పలువురికి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంత డోసు తీసుకోవాలి.. రెండో డోసుకు సమయం ఎంత.. ఎవరు వేసుకోవచ్చు.. ఇలా రకరకాల ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలుంటాయా.. అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు పలు ప్రశ్నలకు సమాధానాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన వ్యాక్సిన్‌పై ఏమన్నారంటే... (చదవండి: కొత్త వైరస్: ఆ లక్షణాలు కనిపించడం లేదు)
► పారామెడికల్, మెడికల్, పోలీసులు వంటి వారికి మొదటి ప్రాధాన్యం.
► వ్యాక్సిన్‌ను బట్టి రెండో డోసు 21 రోజులకు లేదా 28 రోజులకు ఇస్తారు.
► ఒక మోతాదు మాత్రమే తీసుకుంటే 60 నుంచి 80 శాతమే రక్షణ ఉంటుంది. రెండో మోతాదు కూడా తీసుకోవాలి.
► రెండో మోతాదు తీసుకున్న 10 రోజుల తర్వాత రక్షణ ప్రారంభమవుతుంది. దీని సమర్థత 70 నుంచి 90 శాతం వరకూ ఉంటుంది.
► కరోనా పాజిటివ్ వారూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. యాంటీబాడీస్ వృద్ధి చెందకపోయి ఉంటే వ్యాక్సిన్ అవసరం కావొచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ప్రారంభ దశలో టీకా అవసరం లేకపోవచ్చు. మధుమేహం ఉన్నవారు, ఏదైనా అలర్జీతో బాధపడుతున్న వారూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
► ఆల్కహాల్ తీసుకునే వారు వ్యాక్సిన్ తీసుకుంటే.. రోగ నిరోధక ప్రతి స్పందనలను తగ్గించే అవకాశం ఉంది. చిన్న పరిమాణంలో వైన్ లేదా బీర్ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదం లేనట్టు రష్యాలో తేలింది.
► గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ఏ కంపెనీ ఇంకా పరీక్షించలేదు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదని (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సీడీసీ సలహా ఇచ్చింది.
► ఇప్పటి వరకూ జరిగిన ట్రయల్స్‌ను బట్టి 18 ఏళ్ల వయసు పైబడిన వారికే వ్యాక్సిన్ ఇస్తారు. ప్రస్తుతం 12 ఏళ్ల వారికి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
► ఇది ఎంతకాలం రోగ నిరోధక శక్తినిస్తుందో ఇంకా తెలియదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. చిన్న చిన్న దుష్ప్రభావాలు అంటే తేలిక పాటి జ్వరం, అలసట వంటివి తప్ప అన్ని టీకాలు సురక్షితమైనవే. ► కోవిన్ అంటే చాలా మందికి తెలియదు. ఇది మొదటి, డిజిటల్ ఎండ్ టు ఎండ్ టీకా పంపిణీ నిర్వహణ వ్యవస్థ. ఇందులో లబ్ధిదారుల నమోదు, ధ్రువీకరణ, వేసే సమయం తదితర వివరాలు పొందుపరుస్తారు. దీనిద్వారా లబ్ధిదారుడి ఫోన్‌కు రూపంలో సమాచారం వస్తుంది. (చదవండి: ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి)
Comments
Please login to add a commentAdd a comment