
పారిస్ ఒలింపిక్స్
టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్‌ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్‌లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు.
పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్‌ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment