sports comipitions
-
స్పోర్ట్స్ న్యూస్: ‘పారిస్’ మార్క్‌ను దాటిన రాంబాబు..
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్‌ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు. పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్‌ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది. ఇవి చదవండి: నేడు జరిగే WPL లో.. కొత్త విజేత ఎవరో!? -
ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు
కడప కల్చరల్, న్యూస్‌లైన్: కడప శిల్పారామంలో వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా శనివారం విద్యార్థులకు క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా యోగాసనాల పోటీలో బాలికల వ్యక్తిగత విభాగంలో తేజ, సుస్మిత, లహరి, బాలుర వ్యక్తిగత విభాగంలో ఆంజనేయప్రసాద్, కుమార్, యువతేజ మొదటి మూడు స్థానాలు సాధించారు. యోగ పిరమిడ్స్ ప్రక్రియలో బాలికల విభాగంలో బాలాంజలి బృందం, బాలుర విభాగంలో కుమార్ బృందం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. తాడాట పోటీల్లో డి.రాజ్యలక్ష్మి, కె.పద్మజ, కెవి హరిష్మ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. పాటల పోటీల్లో సుప్రియ, సౌజన్య, లహరి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వీరికి మంగళవారం వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సభలో బహుమతులను అందజేయనున్నట్లు శిల్పారామం పాలనాధికారి మునిరాజు తెలిపారు.