కడప కల్చరల్, న్యూస్‌లైన్: కడప శిల్పారామంలో వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా శనివారం విద్యార్థులకు క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా యోగాసనాల పోటీలో బాలికల వ్యక్తిగత విభాగంలో తేజ, సుస్మిత, లహరి, బాలుర వ్యక్తిగత విభాగంలో ఆంజనేయప్రసాద్, కుమార్, యువతేజ మొదటి మూడు స్థానాలు సాధించారు.
యోగ పిరమిడ్స్ ప్రక్రియలో బాలికల విభాగంలో బాలాంజలి బృందం, బాలుర విభాగంలో కుమార్ బృందం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. తాడాట పోటీల్లో డి.రాజ్యలక్ష్మి, కె.పద్మజ, కెవి హరిష్మ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. పాటల పోటీల్లో సుప్రియ, సౌజన్య, లహరి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వీరికి మంగళవారం వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సభలో బహుమతులను అందజేయనున్నట్లు శిల్పారామం పాలనాధికారి మునిరాజు తెలిపారు.
ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు
Published Sun, Apr 6 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
Advertisement
Advertisement