anjaneyaprasad
-
ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు
కడప కల్చరల్, న్యూస్‌లైన్: కడప శిల్పారామంలో వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా శనివారం విద్యార్థులకు క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా యోగాసనాల పోటీలో బాలికల వ్యక్తిగత విభాగంలో తేజ, సుస్మిత, లహరి, బాలుర వ్యక్తిగత విభాగంలో ఆంజనేయప్రసాద్, కుమార్, యువతేజ మొదటి మూడు స్థానాలు సాధించారు. యోగ పిరమిడ్స్ ప్రక్రియలో బాలికల విభాగంలో బాలాంజలి బృందం, బాలుర విభాగంలో కుమార్ బృందం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. తాడాట పోటీల్లో డి.రాజ్యలక్ష్మి, కె.పద్మజ, కెవి హరిష్మ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. పాటల పోటీల్లో సుప్రియ, సౌజన్య, లహరి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వీరికి మంగళవారం వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సభలో బహుమతులను అందజేయనున్నట్లు శిల్పారామం పాలనాధికారి మునిరాజు తెలిపారు. -
‘ఎంసెట్’కు ఏర్పాట్లు పూర్తి
వనపర్తిటౌన్, న్యూస్‌లైన్ : ఎంసెట్‌ను పకడ్బందీగా, సమర్థవంతగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంసెట్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రొఫెసర్ ఆంజనేయప్రసాద్ వెల్లడించారు. గురువారం వనపర్తిలో ఎంసెట్ కేంద్రాల్లోని వసతులను తెలుసుకునేందుకు హైదారాబాద్ నుంచి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. ‘ఎంసెట్ ప్రశ్నలు మావద్దని ఉన్నాయనిగాని, మాకు అన్నీ తెలుసు’ అని ఎవరైనా విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తే ఛిౌఠ్ఛ్ఛిట్ఛ్చఝఛ్ఛ్టి ఃజఝ్చజీ. ఛిౌఝ కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గొప్యం గా ఉంచుతామన్నారు. జేఎన్టీయూ ఎంసెట్ నిర్వహిస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అవకతవకతలు జరగలేదని, ఈ ఏడాది ఎన్టీఆర్ వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష లీకేజీ దృష్ట్యా మే 22న నిర్వహించబోయే ఎంసెట్‌కు ప్రతి పరీక్ష కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తో పాటు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు(ఏప్రిల్ 3) వరకు రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి 2.36 లక్షలు, మెడికల్‌కు 98వేల మంది అభ్యర్థులున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, గంట ముం దే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షలో ఎక్కడ మార్కులో కోల్పోయారో చూపించేందుకు ఫలితాలు వెల్లడించిన్నప్పుడు ఈ సారి ఆన్లైన్లో విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు ఉంచేందు కు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. అవసరమైన చోట జమారస్ రాష్ట్ర వ్యాప్తంగా 29 రీజినల్‌లో ఎంసెట్ పరీక్ష జరుగుతోందని, అవసమైన చోట జామారస్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నామని ఆంజనేయప్రసాద్ తె లిపారు. తద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్‌లు, సెల్ఫోన్లు అభ్యర్థులు నిఘా నేత్రలకు కంటపడకుండా తీసుకెళ్లినా అవి పని చేయవన్నారు. ఈనెల 6 నుంచి 13వ వరకు దరఖాస్తుల సవరణ ఆన్లైన్లో ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫారల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 6 నుంచి 13 వరకు అవకాశం ఉందని తెలిపారు. 5వ తేదీ నుంచి ఏప్రిల్ 18 వరకు రూ.500 ఫీజుతో, ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25 వరకు రూ. 1000, ఏప్రిల్ 26 నుంచి మే 8వ తేదీ వరకు రూ. 5 వేల ఫైన్‌తో, మే 9వ తేదీ నుంచి 19వ వరకు రూ. 10వేల ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసిన అభ్యర్థులు మే 8 నుంచి 19 వరకు హాల్టేకిట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిం చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు హాల్‌టికెట్లు, ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో పాటు కుల ధ్రువీకరణ పత్రం మీద తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి సంతకం చే యించుకోని రావాలని సూచించారు. సమావేశంలో ఎంసెట్ ఛీప్ కంట్రోలర్ జి. కృష్ణమోహన్‌రావు, వనపర్తి రీజినల్ కో-ఆర్డినేటర్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
4 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఈడీ ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ ఆఖరు నాటికి ఇది రూ. 3.52 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడున్న 3,145 శాఖల సంఖ్యను 3,250కి పెంచుకోనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనూ ప్రస్తుతం 462 శాఖలు ఉండగా.. మార్చి ఆఖరు నాటికి 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మంగళవారం ఇక్కడ విలేకరులతో ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ వ్యాపారం సుమారు రూ. 32,500 కోట్లుగా ఉందని, ఇది రూ.34,000 కోట్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే వెల్లడించిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రస్తావిస్తూ.. బ్యాంకింగ్ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తాము మెరుగైన పనితీరునే సాధించ గలిగామని ఆంజనేయ ప్రసాద్ చెప్పారు. కొత్త శాఖల ద్వారా కరెంటుసేవింగ్స్ అకౌంట్లు ఖాతాలను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లుతెలిపారు. తద్వారా ప్రస్తుతం 30.82 శాతంగా ఉన్న కాసా నిష్పత్తిని .. 31శాతానికి పెంచుకోగలమని ఆయన చెప్పారు. మొండి బకాయిల కట్టడిపై దృష్టి.. డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా ఎల్ఐసీ పాలసీలు విక్రయించడం ద్వారా రూ. 3 కోట్ల పైగా కమీషన్ లభించిందన్నారు. ఇక, మొండి బకాయిలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయితే వీటి కట్టడి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణ.. ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్ల మేర మూలధనం సమకూర్చిందని.. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (కిప్) ఇష్యూ ద్వారా మరో రూ. 200 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం ఉందని ఆంజనేయ ప్రసాద్ చెప్పారు. సిండ్ దిశ డిపాజిట్ పథకం.. కొత్తగా సిండ్ దిశ పేరుతో ఈ నెల 6 నుంచి డిపాజిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. 444 రోజుల వ్యవధికి గాను 9.25 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్స్‌కి 9.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పరిమిత కాల డిపాజిట్ పథకం కింద సుమారు నెల రోజుల వ్యవధిలో రూ. 10,000 కోట్ల దాకా సమీకరించాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. గరిష్టంగా రూ. 10 కోట్ల దాకా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఆంధ్రప్రదేశ్) పి. రాజారెడ్డి పేర్కొన్నారు.