‘ఎంసెట్’కు ఏర్పాట్లు పూర్తి | ready for eamcet exams | Sakshi
Sakshi News home page

‘ఎంసెట్’కు ఏర్పాట్లు పూర్తి

Published Fri, Apr 4 2014 3:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ready for eamcet exams

వనపర్తిటౌన్, న్యూస్‌లైన్ : ఎంసెట్‌ను పకడ్బందీగా, సమర్థవంతగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంసెట్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రొఫెసర్ ఆంజనేయప్రసాద్ వెల్లడించారు. గురువారం వనపర్తిలో ఎంసెట్  కేంద్రాల్లోని వసతులను తెలుసుకునేందుకు హైదారాబాద్ నుంచి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. ‘ఎంసెట్ ప్రశ్నలు మావద్దని ఉన్నాయనిగాని, మాకు అన్నీ తెలుసు’ అని ఎవరైనా విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తే ఛిౌఠ్ఛ్ఛిట్ఛ్చఝఛ్ఛ్టి ఃజఝ్చజీ. ఛిౌఝ కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గొప్యం గా ఉంచుతామన్నారు.
 
 జేఎన్‌టీయూ ఎంసెట్ నిర్వహిస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అవకతవకతలు జరగలేదని, ఈ ఏడాది ఎన్టీఆర్ వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష లీకేజీ దృష్ట్యా మే 22న నిర్వహించబోయే ఎంసెట్‌కు ప్రతి పరీక్ష కేంద్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తో పాటు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు(ఏప్రిల్ 3) వరకు రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి 2.36 లక్షలు, మెడికల్‌కు 98వేల మంది అభ్యర్థులున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, గంట ముం దే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షలో ఎక్కడ మార్కులో కోల్పోయారో చూపించేందుకు ఫలితాలు వెల్లడించిన్నప్పుడు ఈ సారి ఆన్‌లైన్‌లో విద్యార్థుల ఓఎంఆర్ షీట్‌లు ఉంచేందు కు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
 
 అవసరమైన చోట జమారస్
 రాష్ట్ర వ్యాప్తంగా 29 రీజినల్‌లో ఎంసెట్ పరీక్ష జరుగుతోందని, అవసమైన చోట జామారస్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నామని ఆంజనేయప్రసాద్ తె లిపారు. తద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్‌లు, సెల్‌ఫోన్లు అభ్యర్థులు నిఘా నేత్రలకు కంటపడకుండా తీసుకెళ్లినా అవి పని చేయవన్నారు.
 
 ఈనెల 6 నుంచి 13వ వరకు
 దరఖాస్తుల సవరణ
 ఆన్‌లైన్‌లో ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫారల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 6 నుంచి 13 వరకు అవకాశం ఉందని తెలిపారు. 5వ తేదీ నుంచి ఏప్రిల్ 18 వరకు రూ.500 ఫీజుతో, ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25 వరకు రూ. 1000, ఏప్రిల్ 26 నుంచి మే 8వ తేదీ వరకు రూ. 5 వేల ఫైన్‌తో, మే 9వ తేదీ నుంచి 19వ వరకు రూ. 10వేల ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసిన అభ్యర్థులు మే 8 నుంచి 19 వరకు హాల్‌టేకిట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిం చారు.
 
 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు హాల్‌టికెట్లు, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంతో పాటు కుల ధ్రువీకరణ పత్రం మీద తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి సంతకం చే యించుకోని రావాలని సూచించారు. సమావేశంలో ఎంసెట్ ఛీప్ కంట్రోలర్ జి. కృష్ణమోహన్‌రావు, వనపర్తి రీజినల్ కో-ఆర్డినేటర్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement