రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం అలిమిల్లి వద్ద ఓ బైక్ అదుపు తప్పి వంతెన పై నుంచి 20 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాంబాబు (28) పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటరామణ, మోహన్ అనే వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరు ముగ్గురూబాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో పెళ్లికి హాజరై గూడూరు మండలం చెన్నూరుకు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.