అప్పుల భారం మరో రైతును బలితీసుకుంది. అప్పుల బాధ తాళలేక 10 రోజుల క్రితం ఆత్మహత్యా యత్నం చేసిన రాంబాబు(52) అనే రైతు.. ఆదివారం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట మండలం వేట్ల పాళెం గ్రామానికి చెందిన వాడు.
కాగా.. రాంబాబు భీమేశ్వరాలయానికి సంబంధించిన 30 ఏకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం కోసం రూ.10లక్షల దాకా అప్పు చేశాడు. అప్పులు ఇచ్చినవారి వత్తిడి ఎక్కువ కావడంతో తన పేర ఉన్న ఇల్లు, పొలం కూడా అమ్మేశాడు. ఇంకా అప్పు మిగిలి ఉండడంతో పది రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. మృతునికి బార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.