
ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు
హైదరాబాద్: నగరంలోని వీఎన్‌ఆర్ సద్గురు పాఠశాలలో జరిగిన వినాయక చిత్రమాలికలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ముక్కుతో గణనాధుడి బొమ్మగీసి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పాఠశాలకు చెందిన మాస్టర్ రాంబాబు బ్లాక్ పేయింట్‌ను ముక్కుసాయంతో వాడుతూ అద్భుతమైన గణనాధుని విగ్రాహాన్ని ఆవిష్కరించారు.