కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు: మోహన్ బాబు | The court did not give the final verdict: Mohan Babu | Sakshi
Sakshi News home page

కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు: మోహన్ బాబు

Published Tue, Dec 24 2013 4:49 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు: మోహన్ బాబు - Sakshi

కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు: మోహన్ బాబు

(అనిశెట్టి రామకృష్ణ - అన్నవరం)
తన పద్మశ్రీ పురస్కారం వివాదంపై హైకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని ఈరోజు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తుది తీర్పు ఇవ్వకముందే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. ఓ వివాదం కోర్టు విచారణలో ఉండగా తాను మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు.

 ఎన్నో మంచి పనులు చేశానని, అందుకే ప్రభుత్వం తనను పద్మశ్రీతో గౌరవించిందన్నారు. భవిష్యత్లో తనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్లు కూడా వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తనను దెబ్బతీయడానికి ఎవరో పన్నిన కుట్ర ఇదని ఆయన అన్నారు. గడ్డి తిన్న ఆవు పాలు ఇస్తుందని, పాలు తాగిన మనిషి విషం కక్కుతాడని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నేతలతో కూడా తనకు సత్ సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. తనకు మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement