సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట | Supreme Court stays order on Mohan Babu to return Padma Shri | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట

Published Thu, Apr 17 2014 11:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట - Sakshi

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట

న్యూఢిల్లీ : పద్మశ్రీ అవార్డు  వ్యవహారంలో  సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీని వెనక్కి ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలపై ఉన్నత ధర్మాసనం గురువారం స్టే విధించింది. మరోవైపు సినిమా టైటిల్స్లో ఇకపై పద్మశ్రీ వాడనని మోహన్ బాబు ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. పద్మశ్రీని ఇకపై పేరుకు ముందు వాడబోమని, సినిమాల్లో వాడి ఉంటే తొలగిస్తామని ఆయన ప్రమాణపత్రం దాఖలు  చేశారు.

మోహన్‌బాబుకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతికి  తిరిగి అప్పగించేలా కేంద్ర హోం శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాల నుంచి ఉపశమనం కోరుతూ మోహన్‌బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement