సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళ అయిన పద్మశ్రీ కి సీఎం జగన్ బీఫామ్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇవాళ జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగ్గా.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీకి జిల్లా మంత్రులతో పాటు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు.
‘‘బీసీ మహిళగా నన్ను గుర్తించిన సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. సాధారణ గృహిణి నైన నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు . కొప్పుల వెలమలకు పెద్దపీట వేస్తూ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెరుగైన పాలన అందించి సీఎం జగన్‌కి మంచి పేరు తీసుకొస్తాను’’ అని గంటా పద్మశ్రీ చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినట్లే వెనుక బడిన వర్గాలకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ,అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా ఉంటున్నారు.
పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్య కర్త కు మంచి భవిష్యత ఉంటుందని నిరూపించారు. ఒక బీసీ మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు.
::ఎమ్మెల్యే ఆళ్ళ నాని
బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. నాడు జడ్పీ చైర్మన్ గా నాకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. నేడు మంత్రి గా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇచ్చారు. ఉద్యోగులకు వరాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈనాడు లాంటి టిష్యూ పేపర్ మరొకరి లేదు. మేము అప్పుల పాలు చేశాము అంటున్నారు. మరి ఆనాడు 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... వారికి కనపడలేదు. 4500 కోట్లు పసుపు కుంకుమ రూపంలో డైవర్ట్ చేశారు చంద్రబాబు. బాబు చేసిన అప్పై మేము తీర్చు తున్నాము.
::: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు
ఈరోజు సామాజిక విప్లవం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. బలహీన వర్గాల చెందిన వ్యక్తి కవురు శ్రీనివాస్ ను శాసనమండలికి పంపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసి విప్లాత్మకమైన మార్పు తెచ్చారు.
:::ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు
40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు బీసీలను ముందు పెట్టీ అధికారం అనుభవించేవాడు. ఇప్పుడు బీసీ వెలమ కులస్తులకి జడ్పీ చైర్మన్ కేటాయించి ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు ఇచ్చి ఆయన రుణo తీర్చుకుందాం
::: ఎంపీ కోటగిరి శ్రీధర్
రెండో మహిళగా..
పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1936లో జిల్లా బోర్డుగా ఏర్పడింది. 1959 లో జిల్లా ప్రజాపరిషత్‌గా అవతరించింది. అప్పటి నుంచి 21 మంది జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో 1995, 2000లో జెడ్పీ చైర్మన్‌గా ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment