సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పలు విషయాలు వెల్లడించింది. జయరాం చనిపోయిన రోజు తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో లాంగ్‌డ్రైవ్‌లో ఉన్నానని శిఖా చౌదరి విచారణలో తెలిపింది. మామయ్య రోడ్డుప్రమాదంలో మరణించిన విషయం ఆమె తల్లి చెబితేనే తెలిసిందని శిఖా స్పష్టం చేసింది. తన పేరున జయరాం పది ఎకరాల భూమిని కొన్నారని, డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వెల్లడించింది. జయరాంను తాను చంపలేదని పేర్కొన్న శిఖా.. డాక్యుమెంట్ల కోసం ఓ యువతిని ఎరవేసిన మాట నిజమేనని ఒప్పుకుంది. డాక్యుమెంట్ల కోసం జయరాం ఇంటికి వెళ్లటం వాస్తవమేనని తెలిపింది. అయితే జయరాంను రాకేష్ ఏం చేశాడో తెలియదని పేర్కొంది.
నాకు, నా పిల్లలకు రక్షణ కల్పించండి: జయరాం భార్య
జయరామ్ భార్య పద్మశ్రీ వాంగ్మూలాన్ని నందిగామ పోలీసులు రికార్డ్ చేశారు. ఎస్‌ఐతో పాటు ఇద్దరు పోలీసులు, న్యాయవాది సమక్షంలో పద్మశ్రీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. తనకు ఎవరిపై అనుమానం లేదని, తన భర్తను ఎవరు హత్య చేసారో.. ఎందుకు హత్య చేసారో తేల్చాలని ఏపీ పోలీసులను కోరింది. తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఏపీ పోలీసులను కోరింది. ఇండియాలో ఏం జరుగుతుందో తనకు ఏమీ తెలియదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment