
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 23పేజీల ఛార్జ్‌షీట్‌లో 12మంది నిందితులను పేర్కొన్నారు. ఈ కేసులో 73 మంది సాక్షులుగాను విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. ఏ-1గా రాకేష్, ఏ-2గా విశాల్‌ను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అయితే ఈ కేసులో చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా పేర్కొన్నారు. హనీ ట్రాప్ ద్వారానే జయరాంను హత్య చేశారని చెప్పారు. అలాగే ఇందులో ముగ్గురు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు.. వారి సలహా మేరకే జయరాం మృతదేహాన్ని తరలించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫోటోలను పోలీసులు రాకేశ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment