సాక్షి, అమరావతి/హైదరాబాద్ : కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. జయరాం హత్య వెనుక ఆర్థికలావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (మేనకోడలు పాత్రపై అనుమానాలు!)
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిఖాను నందిగామ రూరల్ సర్కిల్ ఆఫీస్‌లో విచారిస్తున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆమెను కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశజూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శిఖా కోసం సీని నిర్మాత కేపీ చౌదరి రావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. స్టేషన్ వద్ద ఉన్న శిఖా కారును కేపీ చౌదరి తీసుకెళ్లారు. అమెరికా నుంచి వచ్చిన జయరాం కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మృతుని స్నేహితుల వివరాలపై వారిని ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment