సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో నిందితుడు రాకేష్ నేరం అంగీకరించినట్లు సమాచారం. రాకేష్ పోలీసుల విచారణలో.. ‘‘అప్పు చెల్లించనందుకే జైరాంను హత్య చేశాను. టెట్రాన్ పార్మా కంపెనీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని జైరాం నా దగ్గర 4.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరి నాకు డబ్బులు ఇవ్వాలి. ప్రేమ పేరుతో ఆమె నాతో లక్షలు ఖర్చు చేయించారు. శిఖా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసింది. ఆమె ఇవ్వాల్సిన డబ్బులు జైరాం ఇస్తా అని ఒప్పుకున్నారు.
ఎంత అడిగినా జైరాం డబ్బులు ఇవ్వడం లేదు. గత నెల 29న విదేశాల నుంచి జైరాం రాగానే డబ్బులు అడిగాను. జూబ్లీహిల్స్ రోడ్ 10లో ఉన్న నా ఇంటికి అతన్ని తీసుకెళ్లాను. ఇంట్లో గొడవ జరగటంతో జైరాం నెత్తిమీద గట్టిగా కొట్టాను అతడు చనిపోయాడు. మృతదేహాన్ని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంచి రాత్రి కారులో తీసుకెళ్లి నందిగామలో వదిలేశాను. అక్కడి నుంచి బస్‌లో హైదరాబాద్ వచ్చాన’’ని తెలిపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment