పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో ఎస్‌ఆర్‌నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్(35), ఆయన మేనల్లుడు విస్లావత్ విశాల్(20), సుభాష్‌చంద్రారెడ్డి(26) ఉన్నారు. మంగళవారం ఇక్కడ దర్యాప్తు అధికారి కేఎస్ రావుతో కలసి వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.