సాక్షి, కృష్ణా: నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. టెక్ట్రాన్ కంపెనీ లావాదేవీల విషయంలో శిఖాకు, జయరాంకు మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. జయరాంకు తెలియకుండా కంపెనీ చెక్కులపై శిఖా సంతకాలు కూడా చేసినట్లు వెల్లడయింది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయాల టర్నోవర్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెక్కులపై శిఖా ఫోర్జరీ సంతకాలు చేసినట్లు జయరాం తెలుసుకున్న తరువాత వారిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
శిఖా ఇచ్చిన చెక్కులు బౌన్సు కావడంతో జయరాం పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. టెక్ట్రాన్ కంపెనీ వ్యవహారాలను కూడా శిఖా ఎక్స్‌ప్రెస్ టీవీ కార్యాలయంలోనే జరిపేవారు. జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజేష్.. శిఖాతో పాటు కంపెనీ సమావేశాలకు కూడా హాజరయ్యేవారు. ఇదిలావుడంగా అనేక కంపెనీల్లో జయరాం తరుఫున శిఖా బినామీగా వ్యవహరించారు. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. శిఖాపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆమె పాత్రపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. (జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..!)
Comments
Please login to add a commentAdd a comment