హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాంను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో పాటు డ్రైవర్ శ్రీనివాస్ పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావుతోపాటు వెస్ట్‌జోన్ డీసీపీ ఎఆర్.శ్రీనివాస్ నిందితులను 8 రోజులపాటు విచారించారు. శనివారం వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరితో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులు, రాంబాబును కూడా విచారించారు.
జయరాంను హత్య చేశాక సీఐ రాంబాబు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి 2 సార్లు రాకేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. ఏసీపీ మల్లారెడ్డి విచారణ సందర్భంగా.. బంజారాహిల్స్ సీఐ గోవిందరెడ్డి తనకు రాకేశ్‌ను పరిచయం చేశా రంటూ పోలీసులకు చెప్పారు. దీంతో గోవిందరెడ్డి, హరిశ్చంద్రారెడ్డిని సీసీఎస్‌కు అటాచ్ చేస్తూ శుక్రవా రం ఉత్తర్వులిచ్చారు. జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యా దు మేరకు శిఖా చౌదరి, ఆమె పని మనిషి, వాచ్‌మెన్ల నుంచి సమాచారం సేకరించారు. సినీనటుడు సూర్య ప్రసాద్‌ను విచారించారు. ఇక రాకేశ్ మిత్రులు నాగ వెంకటేష్, శంకర్, సింగ్‌లను విచారించాలని భావిస్తు న్నారు. రాకేశ్‌తో సన్నిహిత సంబంధాలున్న ఓ నేత ను కూడా ఆదివారం విచారించే అవకాశముంది.
ముగిసిన రాకేశ్‌రెడ్డి పోలీసు కస్టడీ
Published Sun, Feb 24 2019 4:27 AM | Last Updated on Sun, Feb 24 2019 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment