కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి నేరచరిత్రపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో అతడిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో అతడు పట్టుబడినట్టు గుర్తించారు. యువతులతో హైటెక్ వ్యభిచార ముఠా నడిపినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరుతో బెదిరించి ఓ వ్యక్తి 80 లక్షలు వసూలు చేసిన కేసులో రాకేష్ అరెస్టైనట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉన్న అతడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
బయటపడుతున్న రాకేష్ నేరచరిత్ర
Published Mon, Feb 4 2019 4:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement