
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య అనంతరం సుభాష్ రెడ్డి కి రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నగేష్, విశాల్, సుభాష్ రెడ్డిలను పోలీసులు రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
శిఖా చౌదరిపై మరోసారి ఫిర్యాదు
జయరాం హత్యకు గురైన తర్వాత ఆయన ఇంట్లో నుంచి శిఖా చౌదరి కీలక పత్రాలు తీసుకెళ్లినట్టు ఆయన భార్య పద్మశ్రీ మరోసారి ఫిర్యాదు చేశారు. తాను అమెరికాకు వెళ్లిపోవడంతో తన తండ్రి పిచ్చయ్య చౌదరితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. శిఖా చౌదరిపై ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలను పోలీసులకు ఆయన సమర్పించారు. ఫిర్యాదు ఆధారంగా శిఖా చౌదరిపై కేసు నమోదు చేయనున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
కాగా, ఈ కేసులో ఇప్పటివరకు100 మందిని పోలీసులు విచారించించారు. నిందితుడితో టచ్‌లో ఉన్న పోలీసు అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశారు. మరోవైపు రెండో రోజు కూడా టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు విచారించారు. (‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత)
Comments
Please login to add a commentAdd a comment