సాక్షి, విజయవాడ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ (55) హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే, జయరామ్ హత్యకేసులో శిఖా పాత్రే లేదంటూ గత నాలుగు రోజులుగా చెప్తున్న నందిగామ పోలీసులు ఆమెను సర్కిల్ కార్యాలయంలో ఉంచి అత్యంత గోప్యత పాటించారు. అక్కడికి ఉన్నతాధికారులు తప్ప ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గత రాత్రి అర్ధరాత్రి మీడియా కళ్లుగప్పిన పోలీసులు శిఖాను రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ముసుగు వేసి హైదరాబాద్‌వైపు తీసుకెళ్లినట్టుగా సమాచారం. (పిడిగుద్దులు గుద్దాను.. చనిపోయాడు!)
తెల్లవారితే జయరాం హత్య కేసులో మీడియా సమావేశం ఉందని చెప్పిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో శిఖా చౌదరిని రహస్య ప్రాంతానికి తరలించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురయిన జయరామ్ భార్య పద్మశ్రీ.. మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అంటూ దుయ్యబట్టారు. తన అక్క నుంచే ప్రాణహాని ఉందని గతంలో తనకు జయరాం చెప్పారన్నారు. ఆయన భారత్‌కు వచ్చాక ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని ఆమె వాపోయారు. వ్యాపార లావాదేవీల సమావేశం నిమిత్తమే అమెరికా నుంచి భారత్‌కు వచ్చారని పద్మశ్రీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment