
హైదరాబాద్: దారుణ హత్యకు గురైన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ప్రవా సాంధ్రుడు చిగురుపాటి జయరామ్ (55) భార్య పద్మశ్రీని బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు మరోసారి విచారించారు. పద్మశ్రీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తన భర్త హత్యలో కుట్ర దాగి ఉందని ఆమె వెల్లడించారు. ఈ హత్యలో ఆయన మేనకోడలు శిఖా చౌదరి కీలక సూత్రధారి అని, రాకేశ్‌రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమేనని పద్మశ్రీ స్పష్టం చేశారు. తన భర్త ఉమనైజర్ కాదని వెల్లడించారు.
పద్మశ్రీ నుంచి జయరామ్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు విచారణ కోసం తీసుకున్నారు. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో శిఖా చౌదరిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ముందుగా ఆమెకు సెక్షన్ 41(ఏ) కింద విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకోసం పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment