brutal murders
-
ఊపిరి తీసిన వివాహేతర సంబంధం
పిఠాపురం: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. మరొకరిని ప్రాణాపాయస్థితికి తీసుకెళ్లింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాసు (45), పెండ్యాల లోవమ్మ (35)లను అదే గ్రామానికి చెందిన లోకా నాగబాబు కత్తితో నరికి చంపాడు. లోవమ్మ తల్లి రామలక్షి్మపైనా దాడి చేయడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. పెండ్యాల లోవమ్మ భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. గ్రామానికి చెందిన లోకా నాగబాబుతో సహజీవనం చేస్తోంది. ఇటీవల పోసిన శ్రీనివాసుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో ఆమెను నాగబాబు పలుమార్లు హెచ్చరించాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 20 రోజులుగా శ్రీనివాసు, లోవమ్మలను వెంబడిస్తున్నాడు. ప్రతి రోజూ శ్రీను తన మోటారు సైకిల్‌పై లోవమ్మను తన పొలంలోకి పనులకు తీసుకెళ్లడం గమనించాడు. ఎలాగైనా వారిద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. మాటు వేసి దాడి లోకా నాగబాబు మంగళవారం అర్థరాత్రి చేబ్రోలు శివారు లక్ష్మీపురం పొలిమేరలో ఉన్న శ్రీనివాసు పొలానికి కత్తి తీసుకుని వెళ్లాడు. తన మోటారుసైకిల్‌ను దూరంగా పొదల్లో దాచాడు. అక్కడ బెండ తోట పక్కనే ఉన్న నువ్వుల చేనులో దాకున్నాడు. కాగా.. శ్రీనివాసు తన పొలంలో బెండకోత కోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని బుధవారం ఉదయం 4.30 గంటలకు వారిని రమ్మని చెప్పాడు. ముందుగానే లోవమ్మను తీసుకుని పొలానికి వెళ్లిపోయాడు. అక్కడే నువ్వుల చేలో దాక్కున్న నాగబాబు వారిద్దరిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లి రామలక్షి్మపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విని స్థానికులు అక్కడకు వచ్చేసరికీ నాగబాబు పరారయ్యాడు. కాగా.. బెండకాయల కోతకు వచ్చిన కూలీలు పొలంలో లోవమ్మ, శ్రీనివాసు మృతదేహాలను చూశారు. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోసిన శ్రీనివాసుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగబాబు గత 20 రోజులుగా కత్తి తీసుకుని శ్రీనివాసు పొలంలో తిరగడాన్ని సమీపంలోని రైతులు గమనించారు. ఈ విషయాన్ని శ్రీనివాసుకు చెప్పినా అతడు పట్టించుకోలేదు. నాగబాబు గతంలో లోవమ్మ వెంటబడిన ఒక వ్యక్తి చెయ్యి నరికాడని, ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని స్థానికులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
శిఖాచౌదరే సూత్రధారి
హైదరాబాద్: దారుణ హత్యకు గురైన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ప్రవా సాంధ్రుడు చిగురుపాటి జయరామ్ (55) భార్య పద్మశ్రీని బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు మరోసారి విచారించారు. పద్మశ్రీ ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తన భర్త హత్యలో కుట్ర దాగి ఉందని ఆమె వెల్లడించారు. ఈ హత్యలో ఆయన మేనకోడలు శిఖా చౌదరి కీలక సూత్రధారి అని, రాకేశ్‌రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమేనని పద్మశ్రీ స్పష్టం చేశారు. తన భర్త ఉమనైజర్ కాదని వెల్లడించారు. పద్మశ్రీ నుంచి జయరామ్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు విచారణ కోసం తీసుకున్నారు. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో శిఖా చౌదరిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ముందుగా ఆమెకు సెక్షన్ 41(ఏ) కింద విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకోసం పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. -
ఉలిక్కిపడిన గ్రామం : ఇద్దరి దారుణ హత్య
సాక్షి, కామారెడ్డి : బికనూర్ మండలం జంగంపల్లిలో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్, కోశాధికారి రాములును అర్ధరాత్రి గ్రామ శివారులో అత్యంత పాశవికంగా బండరాళ్లతో మోది చంపారు. సంఘటన స్థలంలో మద్యం సీసాలు ఉన్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో తగాదాలు జరిగినప్పుడు తరచుగా పంచాయితీలు నిర్వహించడం ఆనవాయితీ. మృతులిద్దరూ పంచాయతీ వివాదాల్లో తలదూర్చడం వల్లే హత్యలకు కారణాలుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి సందర్శించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
ఉద్యోగం కోసం కన్నవారిని కడతేర్చాడు!
సంగారెడ్డి మున్సిపాలిటీ (మెదక్) : ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిదండ్రులతో పాటు మేనల్లుడిని సైతం పొట్టనబెట్టుకున్న నిందితుడికి యావజ్జీవ కారగార శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా జడ్జి ఎంవీ రమణ నాయుడు తీర్పు చెప్పారు. మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్ పరిశ్రమలో సుధాకర్ రెడ్డి ఉద్యోగం చేస్తూ టౌన్ షిప్లో జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి చిల్లరిగా తిరుగుతూ అప్రయోజకునిగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని స్నేహితులు సలహా ఇచ్చారు. దీంతో ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు రకరకాల ప్లాన్లు వేశాడు. ఏవీ పారకపోవటంతో చివరికి తండ్రిని చంపేసి ఆయన ఉద్యోగంలో చేరిపోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం 2013 అగస్టు 28న తల్లిదండ్రులు, మేనల్లుడు మణికంఠరెడ్డి ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తుండగా వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బయటకు రాకుండా తలుపులకు గడియ వేశాడు. చనిపోయారని భావించిన తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసు విచారణలో తేలాయి. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ
-
క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ
కైరో: మతోన్మాదం నెత్తికెక్కిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఈజిప్ట్‌కు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను లిబియాలో అత్యంతపాశవికంగా హతమార్చారు. లిబియా రాజధాని ట్రిపోలీ దగ్గర్లోని సముద్రతీరంలో ఆ క్రిస్టియన్లకు ఆరెంజ్ రంగు దుస్తులు వేసి, చేతులను వెనక్కు విరిచికట్టేసి, వరుసగా నిల్చోబెట్టి నలుపురంగు దుస్తులు, ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్న ఉగ్రవాదులు అత్యంత హేయం గా తలలు తెగనరికారు. ఆ దృశ్యాలున్న వీడియోను ఆన్లైన్లో ఆదివారం విడుదల చేసి, ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేశారు. ఐదు నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియో చివరలో ఒక ఉగ్రవాది ‘అల్లాపై ఒట్టేసి చెబుతున్నాం. షేక్ ఒసామా బిన్ లాడెన్ శరీరాన్ని మీరు దాచి న సముద్ర జలాల్లోనే మీ రక్తాన్ని కలుపుతాం’ అంటూ ప్రతినబూనిన దృశ్యం కూడా ఉంది. తమ తదుపరి లక్ష్యం ఇటలీ రాజధాని రోమ్ అనే హెచ్చరిక ఆ వీడియోలో ఉంది. లిబియాలోని సిర్తె పట్టణంలో నెల రోజుల క్రితం ఆ క్రిస్టియన్ కార్మికులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఐఎస్ బలంగా ఉన్న సిరియా, ఇరాక్‌లకు ఆవల మరో దేశంలో ఈ స్థాయి హత్యలకు తెగబడడం ఐఎస్‌కు ఇదే తొలిసారి. ఉగ్రవాదుల దుశ్చర్యపై ఈజిప్ట్ తీవ్రంగా స్పందించింది. ఆ వీడియో విడుదలైన కాసేపటికే.. పొరుగుదేశం లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదసంస్థ స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఆయుధాగారాలపై యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున పలు దఫాలుగా వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 64 మంది మిలిటెంట్లు హతమయ్యారని, ఐదుగురు పౌరులు చనిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు. బషీర్ అల్ దెర్సి సహా ఐఎస్ కీలక నేతలు ముగ్గురు ఈ దాడుల్లో చనిపోయారన్నారు. ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న దెర్నా, సిర్తె పట్టణాలపై జరిగిన ఆ దాడులకు లిబియా సైన్యం కూడా సహకరించిందన్నారు. ఈజిప్ట్‌తో సమన్వయంతో రానున్న రోజుల్లో ఐఎస్‌పై మరిన్ని దాడులు చేస్తామన్నారు. ఈ దాడులతో ఐఎస్‌పై పోరులో ఈజిప్ట్ ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రారంభమైంది. ఉగ్రవాదుల చర్యను అత్యంత విషపూరిత చర్యగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసి అభివర్ణించారు. ఇరాక్, సిరియాల్లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఐఎస్‌పై జరుపుతున్న పోరును లిబియాకు విస్తరించాలని కోరారు. ‘హంతకులపై ఎప్పుడు, ఎలాంటి చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఈజిప్ట్‌కు ఉంది. ఉగ్రవాదాన్ని అణచేసే సామర్ధ్యం ఈజిప్ట్‌కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ కలసిరావాలి’ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సిసి.. దేశవ్యాప్తంగా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. లిబియాకు ఎవరూ వెళ్లొద్దని, అక్కడ ఉన్నవారు కూడా తిరిగి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఉగ్రవాదంపై పోరు’ సదస్సులో పాల్గొనేందుకు తక్షణమే వెళ్లాలని విదేశాంగ మంత్రిని ఆదేశించారు. కాగా, ఐఎస్ ఉగ్రవాదుల మారణకాండపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ఐరాస భద్రతామండలి, అమెరికా, ఖండించాయి.