
సాక్షి, కామారెడ్డి : బికనూర్ మండలం జంగంపల్లిలో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్, కోశాధికారి రాములును అర్ధరాత్రి గ్రామ శివారులో అత్యంత పాశవికంగా బండరాళ్లతో మోది చంపారు. సంఘటన స్థలంలో మద్యం సీసాలు ఉన్నాయి.
గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో తగాదాలు జరిగినప్పుడు తరచుగా పంచాయితీలు నిర్వహించడం ఆనవాయితీ. మృతులిద్దరూ పంచాయతీ వివాదాల్లో తలదూర్చడం వల్లే హత్యలకు కారణాలుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి సందర్శించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.