ఏపీ అసెంబ్లీ సమావేశాలు: గవర్నర్‌ అబ్లుల్‌ నజీర్‌ ప్రసంగం ఇదే.. | AP Governor Abdul Nazeer Speech In AP Assembly Session | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: గవర్నర్‌ అబ్లుల్‌ నజీర్‌ ప్రసంగం ఇదే..

Published Mon, Feb 5 2024 10:56 AM | Last Updated on Mon, Feb 5 2024 2:08 PM

AP Governor Abdul Nazeer Speech In AP Assembly Session - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. 

అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం ఇలా.. 

విద్యా రంగం..

  • దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు. 
  • పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాం. 
  • మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్‌ రూపురేఖలు మార్చాం. 
  • విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం.
  • చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అ‍మ్మఒడి పథకం తెచ్చాం. 
  • పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం. 
  • విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం. 

  • ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం. 
  • ఇప్పటి వరకు గోరుముద్దకు రూ.4,417కోట్లు ఖర్చు చేశాం. 
  • జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
  • జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటి వరకు రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. 
  • విద్యా సంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనది. 
  • 8,9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్‌ పంపిణీ చేశాం. 

  • వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఒకటో తరగతి నుంచి ఐటీ విధానం. 
  • ప్రతీ ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం. 
  • మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యాబోధన. 
  • విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు. 
  • అత్యున్నత 50 విద్యా స్థంస్థల్లో గుర్తించిన 20 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు. 
  • ఇప్పటివరకు రూ.1.25 కోట్ల వరకు మొత్తం రీయింబర్స్‌ చేస్తున్నాం. 
  • ప్రభుత్వ కృషితో స్కూల్స్‌లో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయి. 

వైద్య రంగం..

  • రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు. 
  • 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు. 
  • 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది. 
  • నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు. 
  • ఇప్పటి వరకు 53,126 మంది వైద్యసిబ్బందిని నియమించాం. 
  • ఫ్యామిలీ డాక్టర్‌ కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం. 
  • ఇప్పటి వరకు 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు. 
  • ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేశాం. 
  • ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించాం. 
  • ఇప్పటి వరకు 1.32 కోట్ల ప్రత్యేక రోగుల సేవలు అందించాం. 
  • ఆరోగ్య ఆంధ్ర​ప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. 

వ్యవసాయ రంగం..

  • రైతులు రాష్ట్రానికి వెన్నముక
  • 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 
  • 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. 
  • ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం. 
  • రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ. 
  • రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. 
  • ఉచిత పంట బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802కోట్ల క్లైయిమ్‌లు. 
  • మిచాంగ్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్లు విడుదల. 
  • జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా ఏపీలో 36 శాతం కాగా, జాతీయ సగటు 18శాతమే. 

ఆక్వా రంగం..

  • రూ.50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటు. 
  • ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా. 
  • ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. 
  • దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానం. 
  • వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే రూ.10లక్షల పరిహారం. 
  • 20వేల ఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కింద రూ.128 కోట్లు. 
  •  61వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్‌ ఛార్జీ రాయితీ రూ.3186కోట్లు. 
  • 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్‌. 
  • రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆక్వా హబ్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ. 

మహిళా సాధికారత..

  • మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. 
  • వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం
  • 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు. 
  • రాష్ట్రంలో 55,607 మెయిన్‌, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. 
  • వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణిలు, 28.62 లక్షల మంది పిల్లలకు లబ్ధి. 
  • పౌష్టికాహార పథకాలకు రూ.6688 కోట్లు ఖర్చు. 
  • అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.21.82 కోట్ల విలువైన గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాలు. 
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 66.34 లక్ష మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. 
  • రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3040 కేసులు

పెన్షన్‌ కానుక..

  • 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల పెన్షన్‌ అందిస్తున్నాం. 
  • నెలవారీ పెన్షన్‌ బడ్జెట్‌ రూ.1961 కోట్లు పెరిగింది. 
  • వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు కేటాయింపు. 
  • వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,129 కోట్ల పంపిణీ. 
  • వైఎస్సార్‌ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు జమ. 
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04కోట్లు జమ. 
  • ఐదేళ్లలో రూ.75వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. 
  • 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ. 

  • రూ.71కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల కొనుగోలు. 
  • దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ది. 
  • ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ మొబైల్‌ డిస్పెన్సింగ్‌ ఓనర్లకు 10వేలు ఆర్థిక సాయం. 
  • జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10వేలు అందిస్తోంది. 
  • జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం
  • వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం
  • నాన్‌ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం
  • నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి

పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం..

  • పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత. 
  • పీడీఎఫ్‌ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం. 
  • పోలవరం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు 74.01 శాతం పనులు పూర్తి. 
  • ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఆర్‌ పనిలో 22.42 శాతం పూర్తి.
  • రూ.280 కోట్లతో 10 టీఎంసీల చిత్రావతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. 
  • అవుకు ప్రాజెక్ట్‌ రెండో టన్నెల్‌ను పూర్తి చేశాం. 
  • కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేశాం. 
  • పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించాం. 

24 గంటల త్రీఫేజ్‌ కరెంట్‌

  • విద్యుత్‌ నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ ఫీడర్లు. 
  • గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నాం. 
  • ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. 
  • రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు పగటి పూట కరెంట్‌. 
  • తొమ్మిది గంటల ఉచిత్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. 

  • 1221 కి.మీల రోడ్ల మరమ్మతులకు రూ.490కోట్లతో పనులు. 
  • ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 880 బస్సులు. 
  • జగనన్న టౌన్‌షిప్‌ల కోసం ప్రతీ నియోజకవర్గంలో రెండు ఎంఐజీ లేఅవుట్లు. 
  • 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్ట్‌లు చేపట్టాం. 

ఐటీ, విమానయాన, పర్యాటక​ రంగం..

  • భోగాపురంలో మే మూడో తేదీన నిర్మాణ పనులు ప్రారంభించాం. 
  • మరో 30 నెలల్లో ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు సిద్ధం. 

  • ఐటీ రంగాన్ని ప్రొత్సహించేందుకు ఐటీ పాలసీ 2021-24 ప్రవేశపెట్టాం. 
  • ఐటీ ఫలాలు చివరి మైలురాయి వరకు చేరేలా కృషి. 
  • 200 ఎండబ్ల్యూ డేటా సెంటర్‌ కోసం రూ.14,694కోట్ల  పెట్టుబడి. 
  • మధురవాడలో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు. 

  • పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ టూరిజం పాలసీ 2020-2025
  • అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై ఫోకస్‌. 
  • 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి. 

వికేంద్రీకరణ..

  • వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 
  • 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. 
  • 2.6 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు. 
  • జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం. 
  • 35,44,866 ఎకరాల భూమి పేదలకు పంపిణీ, హక్కులు కల్పించాం. 
  • 20,24,709 మంది భూమి లేని నిరు పేదలకు ప్రయోజనం. 
  • మా ప్రభుత్వంలో పేదరికం 11.52 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement