తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకూ నెరవేర్చలేదని, ఇక ఆ హామీలను అమలు చేసే యోచన కూడా వారికి లేదని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు (సోమవారం) వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధనలు ఉంటే చూపించాలి. 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే సత్తా మీకు లేదా?.. మీరు చేసే దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా?, మాకు సమయం ఇవ్వకపోతే ఏ విధంగా ప్రశ్నిస్తాం?. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారు.
కూటమి ప్రభుత్వం రూ. 57 వేల కోట్లు ఎందుకు అప్పు చేసింది.సూపర్‌సిక్స్ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయి అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ చూసినా బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శించారు.
అందుకే బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ దూరం
శాసన సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగా బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంది. శాసన సభలో కూటమి తర్వాత అత్యధిక ఓట్ షేరింగ్ ఉన్న వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సభలో కూటమి తర్వాత తమదే అత్యధిక ఓటు షేరింగ్ ఉన్న పార్టీ అని స్పీకర్‌కు లేఖ రాసినప్పటికీ ప్రతిపక్షంగా గుర్తించలేదు. గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసింది వైఎస్సార్‌సీపీ.
ఇది కూడా చదవండి: AP Budget 2024: కోతల బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్
Comments
Please login to add a commentAdd a comment