
ఢిల్లీ: ఏపీ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ జస్టిrస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్ సమావేశం అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు. సాయంత్రం గం. 6.15 ని.లకు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో నజీర్ సమావేశమయ్యారు.
రేపు(ఆదివారం) మధ్యాహ్నం గం. 12.30ని.లకు ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నజీర్ సమావేశమవుతారు. అనంతరం రేపు సాయంత్రం గం. 6.30 ని.లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నజీర్ భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment